హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్.. హైదరాబాద్ కంపెనీ సంఘీ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. డీల్ విలువ రూ.6,000 కోట్లు.
ఇందులో భాగంగా ప్రమోటర్లకు చెందిన 72.72% వాటాల కొనుగోలుకు రూ.4,500 కోట్లను అంబుజా పెట్టుబడి పెట్టనుంది. అలాగే సంఘీ సిమెంట్‌పై ఉన్న రూ.1,500 కోట్ల రుణాల బాధ్యతను సైతం స్వీకరించనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానుంది.
సంఘీ సిమెంట్‌కు గుజరాత్‌లోని కచ్ వద్ద 61 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం గల సిమెంట్ ప్లాంటుతోపాటు 66 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల క్లింకర్ ప్లాంట్ ఉంది. అదానీ గ్రూప్‌లోని అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌కు సంయుక్తంగా ఏటా 7 కోట్ల టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2030 నాటికి 14 కోట్ల టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment