అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్ | UltraTech Cement to buy stake in Jaypee Cement Corporation plant for Rs 4,000 cr | Sakshi
Sakshi News home page

అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్

Published Wed, Aug 28 2013 2:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

UltraTech Cement to buy stake in Jaypee Cement Corporation plant for Rs 4,000 cr

 
 న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ జేపీ సిమెంట్ కార్పొరేషన్‌కు చెందిన గుజరాత్ ప్లాంట్‌లో 51% వాటాను కొనుగోలు చేయనుంది. 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల గుజరాత్ సిమెంట్ ప్లాంట్‌లో జేపీకి గల 51% వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ నిర్వహిస్తున్న చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటా విలువను రూ. 4,000 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 10-15 రోజుల్లోగా డీల్ కుదరవచ్చునని వెల్లడించాయి. అయితే ఈ విషయంపై స్పందించేందుకు రెండు కంపెనీల వర్గాలు నిరాకరించాయి. జేపీ గ్రూప్ రియల్టీ, సిమెంట్, ఆతిథ్య రంగాలలో కార్యకలాపాలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ ఏడాదికి 33.5 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాని కలిగి ఉంది.
 
 అజైల్‌లో పూర్తి వాటా విక్రయించిన హెచ్‌బీఎల్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుబంధ కంపెనీ అయిన అజైల్ ఎలక్ట్రిక్ సబ్ అసెంబ్లీ ప్రైవేట్ లిమిటెడ్‌లో తమకున్న మొత్తం వాటాను హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ విక్రయించింది. హెచ్‌బీఎల్‌తోపాటు ఇతర షేర్‌హోల్డర్లకు చెందిన వాటాలు, ఫ్రెష్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అజైల్ ఎలక్ట్రిక్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూప్ కైవసం చేసుకుంది. మొత్తంగా బ్లాక్‌స్టోన్ రూ.400 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. వాటా అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని వ్యాపార విస్తరణకు హెచ్‌బీఎల్ వినియోగించనుంది. అజైల్ ఎలక్ట్రిక్ వాహన విడిభాగాల తయారీలో ఉంది. ఏటా 4 కోట్ల విడిభాగాలు తయారీ సామర్థ్యం ఈ కంపెనీ సొంతం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement