ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లాస్తారు. కానీ అదిలేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్ని ఉండాల్సిందే. అలాంటి దివ్య ఔషదాలున్న వెల్లుల్ని ధరలు విపరీతంగా ఉన్నాయి. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కాసుల కక్కుర్తికోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో వెల్లుల్ని పొట్టు ఒలిచిన తర్వాత రాయిలా గట్టిగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కొన్ని కూరగాయల మార్కెట్లలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజా వెలుగులోకి వచ్చిన కొనుగోలు దారులలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న వెల్లుల్ని స్వచ్ఛతపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.
देशभर में लहसुन के दाम फिलहाल आसमान छू रहे हैं। इस बीच एक हैरान करने वाला मामला सामने आया है, जहां महाराष्ट्र के अकोला में कुछ फेरीवाले नागरिकों को सीमेंट से बना नकली लहसुन बेचकर धोखा दे रहे हैं। #Garlic #Maharashtra #Akola
इनपुट्स: धनंजय साबले pic.twitter.com/Q4v1hZBhR9— सत्य सनातन भारत (Modi ka parivar)🚩🙏🕉️🙏🕉 (@NirdoshSha33274) August 18, 2024
Comments
Please login to add a commentAdd a comment