
కోల్‌కతా: బినానీ సిమెంట్ కొనుగోలు కోసం అల్ట్రాటెక్ దాఖలు చేసిన బిడ్‌ను పరిశీలించాలంటూ రుణదాతల కమిటీకి (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్–సీవోసీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సూచించింది. దాల్మియా భారత్ గ్రూప్ సమర్పించిన దానికన్నా రూ.1,022 కోట్లు అధికంగా అల్ట్రాటెక్ బిడ్ వేసింది.
ఒకవేళ దీనికి సమాన స్థాయిలో దాల్మియా భారత్ గ్రూప్ కొత్తగా మరో బిడ్ వేస్తే దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. మొత్తం మీద జూన్ 24 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. బ్యాంకులకు దాదాపు రూ. 6,500 కోట్లు బకాయిపడిన బినానీ సిమెంట్స్ ప్రస్తుతం దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment