సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు!: ఇండ్-రా | Cement demand to grow by 4-6% next fiscal: Ind-Ra | Sakshi
Sakshi News home page

సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు!: ఇండ్-రా

Published Thu, Feb 18 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు!: ఇండ్-రా

సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు!: ఇండ్-రా

ముంబై: సిమెంట్ డిమాండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4-6 శాతంమేర పెరిగే అవకాశముందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) తన నివేదికలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై అధిక దృష్టి కేంద్రీకరించడమే డిమాండ్ పెరుగుదలకు కారణమని పేర్కొంది. ఇండ్-రా నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 5.6 శాతంమేర పెరిగింది. ఈ డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 శాతంగా ఉంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్ డిమాండ్ పెరిగే అవకాశం లేదని ఇండ్-రా తెలిపింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై అధికంగా దృష్టిపెట్టే అవకాశముందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement