Ind-Ra
-
టెలికం పరిశ్రమ ఆదాయంపై జియో ఎఫెక్ట్!: ఇండ్–రా
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత సర్వీసుల కారణంగా టెలికం పరిశ్రమ దాదాపు 20 శాతంమేర ఆదాయాన్ని కోల్పోయిందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) పేర్కొంది. అలాగే తీవ్రమైన పోటీ కారణంగా పరిశ్రమ 2017–18 అంచనాలను ప్రతికూల స్థితికి సవరించింది. కాగా ఈ అంచనాలు 2016–17కి మధ్యస్థం–ప్రతికూలంగా ఉన్నాయి. -
2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్–రా
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికవృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.4 శాతంగా నమోదవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) మంగళవారం పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మాత్రం 7.9 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర గణాంకాల విభాగం అంచనా 7.1 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. వినియోగ డిమాండ్, ప్రభుత్వ వ్యయాల పెంపు వంటి కారణాల వల్ల వచ్చే ఏడాది వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలో వృద్ధిరేటు వరుసగా 3%, 6.1%, 9.1%గా నమోదవుతాయన్న అంచనాలను వెలువరించింది. -
అప్రమత్తం అవసరం
ఆర్థిక వ్యవస్థపై పలు సంస్థల సూచన న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివిధ విశ్లేషణా సంస్థలు కీలక సంకేతాలను పంపాయి. ఆయా అంశాలకు సంబంధించి పరిస్థితి మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించాయి. పారిశ్రామిక వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని ఇండ్-ఆర్ఏ పేర్కొంటే... ద్రవ్యోల్బణం కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచించింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్య స్థిరత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అభిప్రాయపపడింది. ఐఐపీపై ఇప్పుడే ఆశల్లేవు: ఇండ్-ఆర్ఏ మే నెలలో 1.1 శాతం వృద్ధి, జూన్‌లో 2.1 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం ‘ప్లస్’లోకి వచ్చినప్పటికీ, ఈ ధోరణి కొనసాగడంపై స్పష్టతలేదని పేర్కొంది. తగిన వర్షపాతం నమోదయినప్పటికీ కొన్ని ముఖ్య నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉందని వివరించింది. సరఫరాల్లో సమస్యలు, బ్లాక్‌మార్కెటింగ్ వంటి అంశాలు ఇందుకు కారణంగా చూపింది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది: కొటక్ కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఎగువముఖంగానే పయనించే అవకాశం ఉందని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన ఒక నివేదికలో పేర్కొంది. -
రూ.7.8 లక్షల కోట్లకు విద్యా రంగం!: ఇండ్-రా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశీయ విద్యా రంగం రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది దాదాపు రూ.6.4 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. -
సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు!: ఇండ్-రా
ముంబై: సిమెంట్ డిమాండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4-6 శాతంమేర పెరిగే అవకాశముందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) తన నివేదికలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై అధిక దృష్టి కేంద్రీకరించడమే డిమాండ్ పెరుగుదలకు కారణమని పేర్కొంది. ఇండ్-రా నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 5.6 శాతంమేర పెరిగింది. ఈ డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 శాతంగా ఉంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్ డిమాండ్ పెరిగే అవకాశం లేదని ఇండ్-రా తెలిపింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై అధికంగా దృష్టిపెట్టే అవకాశముందని పేర్కొంది.