అప్రమత్తం అవసరం
ఆర్థిక వ్యవస్థపై పలు సంస్థల సూచన
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివిధ విశ్లేషణా సంస్థలు కీలక సంకేతాలను పంపాయి. ఆయా అంశాలకు సంబంధించి పరిస్థితి మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించాయి. పారిశ్రామిక వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని ఇండ్-ఆర్‌ఏ పేర్కొంటే... ద్రవ్యోల్బణం కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచించింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్య స్థిరత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అభిప్రాయపపడింది.
ఐఐపీపై ఇప్పుడే ఆశల్లేవు: ఇండ్-ఆర్‌ఏ
మే నెలలో 1.1 శాతం వృద్ధి, జూన్‌లో 2.1 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం ‘ప్లస్’లోకి వచ్చినప్పటికీ, ఈ ధోరణి కొనసాగడంపై స్పష్టతలేదని పేర్కొంది. తగిన వర్షపాతం నమోదయినప్పటికీ కొన్ని ముఖ్య నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉందని వివరించింది. సరఫరాల్లో సమస్యలు, బ్లాక్‌మార్కెటింగ్ వంటి అంశాలు ఇందుకు కారణంగా చూపింది.
ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది: కొటక్
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఎగువముఖంగానే పయనించే అవకాశం ఉందని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన ఒక నివేదికలో పేర్కొంది.