Industrial growth
-
ఇంతలో ఎంత తేడా!
సాక్షి, అమరావతి: అటు మూల ధన వ్యయం, ఇటు పారిశ్రామిక వృద్ధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మూల ధన వ్యయం ద్వారా సంపద సృష్టిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో మూల ధన వ్యయం ఖర్చులో ఏపీ చివరి నుంచి మూడో స్థానంలో ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. 2023 – 25 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో చేసిన మూల ధన వ్యయంపై ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2023–24లో 9 నెలల్లోనే 62 శాతం మూల ధన వ్యయం చేసినట్లు వెల్లడించింది. అదే చంద్రబాబు ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో కేవలం 27 శాతం మాత్రమే మూల ధన వ్యయం చేసిందని తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అతి తక్కువగా మూల ధన వ్యయం చేసిన 19 రాష్ట్రాల్లో అట్టడుగున జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర వృద్ధిపై ప్రభావం చూపుతుందని స్పష్టం అవుతోంది.తిరోగమనంలో పారిశ్రామిక వృద్ధి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో పయనిస్తోంది. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడటమే ఇందుకు కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు ఈ ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు వచ్చి ఉంటే పారిశ్రామిక వృద్ధి ఎందుకు తగ్గిందో ఆయనే సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు సమాధానం చెబుతూ రాష్ట్ర వృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని ప్రకారం 2024–25లో పారిశ్రామిక వృద్ధి అంతకు ముందు ఆర్థిక ఏడాది కన్నా తక్కువగా ఉందని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా 2024–25లో కేవలం 6.71 శాతమేనని ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడుతుండటం వల్లే పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పారిశ్రామిక రంగంలోకి వచ్చే మైనింగ్, క్వారీయింగ్‌లో వృద్ధి మైనస్ 1.38 శాతానికి పడిపోయింది. రెడ్‌బుక్ పాలన పేరుతో వేధింపుల పర్వం కొనసాగిస్తుండటంతో పాటు బడా పారిశ్రామిక వేత్తలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సంపద సృష్టి అంటూ జపం చేయడం తప్ప తొమ్మిది నెలల పాలనలో చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రాష్ట్రంలో 1107 ఎస్ఎంఈలు మూత పడినట్లు కేంద్ర మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో పక్క రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరిగిందని పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పురుషుల నిరుద్యోగ రేటు 6.3 శాతం ఉండగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి 7.3 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 6.4 శాతం ఉంది. మహిళల నిరుద్యోగ రేటు 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది.నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదుతమ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శాసన మండలిలో స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పడంపై మంగళవారం మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని మాత్రమే చెప్పామని తెలిపారు. గవర్నర్ ఇంగ్లిష్ ప్రసంగం ప్రతిలో ఇలానే ఉందని, తెలుగు ప్రసంగం ప్రతిలో ఉద్యోగాలు కల్పించినట్లు అచ్చు తప్పు పడిందని చెప్పుకొచ్చారు. -
పరిశ్రమలు రయ్.. ధరలు షాక్!
న్యూఢిల్లీ: భారత స్థూల ఆర్థిక గణాంకాల విషయంలో రెండు కీలక విభాగాలకు సంబంధించి మంగళవారం వెలువడిన గణాంకాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 11.7 శాతం వృద్ధిని (2022 అక్టోబర్ గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 16 నెలల్లో ఇంత అధిక స్థాయిలో (2022 జూన్‌లో 12.6 శాతం తర్వాత) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి. కాగా, గత ఏడాది ఇదే నెల్లో (2022 అక్టోబర్) ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.1 శాతం క్షీణించడంతో తాజా సమీక్షానెల భారీ వృద్ధి గణాంకాలు కనబడ్డానికి ‘బేస్ ఎఫెక్ట్’ కారణమన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇక రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (పీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.55 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో మొదటిసారి ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. నిజానికి ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రాతిపదికన ఎగువ దిశలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం వరకూ ఉండవచ్చు. అయితే ద్రవ్యోల్బణం పట్ల చాలా అప్రమత్తత అవసరమని, 4 శాతం కట్టడే తమ లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన ఐఐపీ కీలక విభాగాల గణాంకాల్లో పరిశీలిస్తే.. ‘బేస్ ఎఫెక్ట్’తో జూమ్! ∙భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దాదాపు 28.3% వాటా కలిగిన పారిశ్రామిక రంగం ఉత్పత్తి 11.7% పెరిగితే, అందులో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం పురోగతి సమీక్షా నెల్లో 10.4%. గత ఏడాది ఇదే నెల్లో ఈ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా 5.8 శాతం క్షీణత నమోదయ్యింది.ఏప్రిల్–అక్టోబర్ మధ్య 6.9 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 6.9%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 5.3%. ఆహార ధరల తీవ్రత దిగువబాటలో కొనసాగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) నవంబర్‌లో ‘యూ–టర్న్’ (సెపె్టంబర్లో 5.02 శాతం, అక్టోబర్‌లో 4.87 శాతం) తీసుకుని, 5.55 శాతంగా నమోదయ్యింది. ఆహార ధరల పెరుగుదల దీనికి కారణం. ఉత్పత్తుల బాస్కెట్లో ఒక్క ఫుడ్ బాస్కెట్‌ను చూస్తే, 2022 నవంబర్‌లో ద్రవ్యోల్బణం 4.67 శాతం, 2023 అక్టోబర్‌లో 6.61 శాతం ఉంటే, తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఇది 8.7 శాతానికి ఎగసింది. మొత్తం సీపీఐలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 50 శాతం. ఇందులో రెండంకెల్లో ధరలు పెరిగిన జాబితాలో సుగంధ ద్రవ్యాలు (21.55 శాతం) పప్పు దినుసులు (20.23 శాతం) కూరగాయలు (17.70 శాతం), పండ్లు (10.95 శాతం), తృణ ధాన్యాలు (10.25 శాతం) ఉన్నాయి. ధరలు పెరిగిన మిగిలిన ఉత్పత్తుల్లో చక్కెర, తీపి ఉత్పత్తులు (6.55 శాతం) గుడ్లు (5.90 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5.75 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (4.22 శాతం), నాన్ ఆల్కాహాలిక్ బేవరేజెస్ (3.58 శాతం) ఉన్నాయి. ఆయిల్, ఫ్యాట్స్ ధరలు మాత్రం 15.03 శాతం తగ్గాయి. ఇక ఫుడ్ అండ్ బేవరేజెస్ ధరల పెరుగుదల 8.02 శాతంగా ఉంది. -
ధరలు అదుపు.. పరిశ్రమల పరుగు!
న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు పూర్తి ఊరటనిచ్చాయి. అధికారికంగా విడుదలైన సమాచారం ప్రకారం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పాలసీ సమీక్షా నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.02 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం మైనస్ 2 లేదా ప్లస్ 2తో 6 శాతం వద్ద ఉండాలి. అయితే తమ లక్ష్యం 4 శాతమేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి తన పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక పారిశ్రామిక రంగ వృద్ధికి సంబంధించిన సూచీ (ఐఐపీ) ఆగస్టులో 10.3 శాతం వృద్ధిని చూసింది. గడచిన 14 నెలల్లో ఈ స్థాయి వృద్ధి రేటు ఎన్నడూ నమోదుకాలేదు. 2023–24లో సగటును 5.4 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. రిటైల్ ధరల తీరు చూస్తే... ఒక్క ఆహార ధరల విషయానికి వస్తే, రెండంకెల్లో (గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చి) ధరలు పెరిగిన వస్తువుల్లో తృణధాన్యాలు (10.95 శాతం), పప్పులు (16.38 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.06 శాతం) ఉన్నాయి. మాంసం, చేపలు (4.11 శాతం), గుడ్లు (6.42 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (6.89 శాతం), పండ్లు (7.30 శాతం), కూరగాయలు (3.39 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (4.52 శాతం), నాన్–ఆల్కాహాలిక్ బేవరేజెస్ (3.54 శాతం), ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ (4.96 శాతం), ఫుడ్ అండ్ బేవరేజెస్ (6.30 శాతం) ఉత్పత్తులో పెరుగుదల రేటు ఒకంకెకు పరిమితమైంది. కాగా, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరలు పెరక్కపోగా 14.04% తగ్గడం గమనార్హం. రంగాల వారీగా పారిశ్రామిక ఉత్పత్తి పురోగతి ఆగస్టు నెలల్లో తయారీ రంగం 9.3 శాతం పురోగతి (2022 ఆగస్టు నెలతో పోల్చి) సాధించింది. విద్యుత్ రంగం 15.3 శాతం, మైనింగ్ 12.3%, భారీ పెట్టుబడులకు, యంత్ర సామాగ్రి కొనుగోళ్లకు ప్రతిబింబంగా ఉండే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో 12.6 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే రిఫ్రిజరేటర్లు, ఎయిర్కండీషర్లకు సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధిలేకపోగా 5.7 శాతం క్షీణత నెలకొంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్– డ్యూరబుల్స్ రంగంలో మాత్రం వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. -
ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్ గ్రాంట్స్ విడుదలపై లోక్‌సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు టీఎంసీ ఎంపీ. ‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్‌లో 5.6 శాతం మేర క్షీణించింది. మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 1/x In the spirit of the inalienable right to question the government, #Trinamool MP @MahuaMoitra makes a point on #ModiSarkar worth paying attention: “..the greatest liars has the believers” isn’t emotive but a fact based construct as #MahuaMoitra states facts on our economy. pic.twitter.com/1ukOSUv0aT — DOINBENGAL (@doinbengal) December 13, 2022 ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తాం’
తాడేపల్లి: వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంగళవారం సచివాలయం నుంచి అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘ గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఈ సమ్మిట్ నిర్వహిస్తాం. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ముందుకు అడుగులు వేస్తున్నాం. గత మూడేళ్లలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు నిర్వహించలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు నిర్వహించడం ప్రారంభించాయి. ఎంఎస్ఎంఈలపై కూడా ఫోకస్ పెట్టాం. రాష్ట్రంలో పరిశ్రల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మచిలీపట్నం, భవనపాడు పోర్టులను నిర్మిస్తున్నాం. విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. 5 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టుకి 2024 జనవరి నాటికి మొదటి షిప్ తెస్తాం. దేశానికి ఏపీనే గేట్వేగా మారబోతోంది. ఆర్థికాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం’ అని తెలిపారు. -
పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పారిశ్రామిక రంగం గడిచిన ఐదేళ్లలో విప్లవాత్మక ప్రగతిని సాధించిందని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్–ఐపాస్)తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి సీఎం కేసీఆర్ ఆలోచనలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషే కారణమన్నారు. ఐదేళ్లలో 11 వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వ గా, అందులో 8,400 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రా రంభించి 12 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని అందిస్తున్నాయని చెప్పారు. శనివారం ఇక్కడి పరిశ్రమల భవన్‌లోని తన కార్యాలయంలో బాలమ ల్లు మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ విధానం ద్వారా రాష్ట్రంలో 8,500 పరిశ్రమలకు అనుమతు లు ఇవ్వడం ద్వారా 1.60 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 12 లక్షలమందికి ప్రత్యక్షంగా, మరో 20 లక్షలమందికి పరోక్షంగా ఉపాధి దొరికిందన్నారు. 23 ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పేందుకు అవసరమైన 39,989 ఎకరాలను సేకరించి రూ.1,825 కోట్లతో అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పించినట్లు పేర్కొన్నారు. -
నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు
న్యూఢిల్లీ: మౌలిక విభాగంగా పేర్కొనే ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ పనితీరు జూన్‌లో పేలవంగా ఉంది. వృద్ధి రేటు (2018 జూన్ ఉత్పత్తితో పోల్చి) కేవలం 0.2 శాతంగా నమోదయ్యింది. చమురు, సిమెంట్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారడం దీనికి ప్రధాన కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. మే గణాంకాలను సైతం దిగువముఖంగా సవరించడం గమనార్హం. మే నెల వృద్ధి శాతాన్ని 5.1 శాతం నుంచి 4.3 శాతానికి కుదించడం జరిగింది. బుధవారం వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం జూన్‌లో ఎనిమిది రంగాల పనితీరునూ చూస్తే... క్షీణతలో 4... ♦ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా 6.8 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. ♦ రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి రేటు –9.3 శాతం క్షీణించింది. ♦ సిమెంట్ రంగం కూడా 1.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ♦ సహజ వాయువుల విభాగంలో కూడా –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. వృద్ధిలో 4 ♦ స్టీల్ పరిశ్రమ 6.9 శాతం వృద్ధిని సాధించింది. ♦ విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి రేటు 7.3 శాతం. ♦ ఎరువుల రంగంలో కేవలం 1.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ♦ బొగ్గు ఉత్పత్తిలో 3.2 శాతం వృద్ధి నమోదయ్యింది. -
ఆమ్యామ్యాలిస్తేనే అనుమతులు
సాక్షి, హైదరాబాద్: ‘‘పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. లంచం ఇవ్వకుంటే పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న తర్వాత అయినా నోటీసులు, తనిఖీల పేరుతో వేధిస్తామని పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. అన్నీ పద్ధతి ప్రకారమే దరఖాస్తు చేసుకున్నా భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు..’’ టీఎస్ఐపాస్ కింద పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారి నుంచి రెవెన్యూ యంత్రాంగం లంచాలు వసూలు చేస్తున్న వైనంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఇదీ! దరఖాస్తు చేసుకున్నప్పట్నుంచీ పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు, ఆ తర్వాత కూడా ఆమ్యామ్యాలు లేనిదే రెవెన్యూ శాఖలో ఏ పనీ జరగడం లేదని ఈ నివేదిక స్పష్టంచేసింది. ఈ నివేదిక నేపథ్యంలో సీఎంవో కార్యాలయం ఇటీవలే రెవెన్యూ శాఖను హెచ్చరించింది. టీఎస్ఐపాస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అవినీతి రహిత కార్యకలాపాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని సీఎం భావిస్తున్నారంటూ ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ సీఈవో పేరిట రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు. టీఎస్ఐపాస్ కింద పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని, సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో హెచ్చరించడం గమనార్హం. ఈ లేఖకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహారంపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరపాలని ఆదేశిస్తూ ఈ నెల 12న సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయినా.. తీరు మారలేదు సాక్షాత్తూ సీఎంవో నుంచి హెచ్చరికలు వచ్చినా క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఓ ప్రైవేటు విద్యుత్ సంస్థకు సంబంధించిన గ్యాస్పైప్లైన్లను కొన్ని భూముల్లోంచి వేసుకునేందుకు అనుమతినిస్తూ ఇటీవల ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఆ ఉత్తర్వులను సదరు కంపెనీ సంస్థ ప్రతినిధికి అందజేసేందుకు లక్షల్లో డిమాండ్ చేసినట్టు తెలిసింది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తెప్పించుకున్న ఉత్తర్వులను కూడా చివరకు ఎంతో కొంత ముట్టజెప్పి తీసుకెళ్లాల్సిన పరిస్థితి! ఇదేగాకుండా రెండు అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపు ఉత్తర్వులను ఇదే డిమాండ్‌తో నిలిపివేశారని సమాచారం. హైదరాబాద్ స్థాయిలోనే వసూళ్ల పర్వం ఇలా ఉంటే... క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకెలా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ద్రవ్యోల్బణం ఊరట – పరిశ్రమల ఉసూరు!
► మార్చిలో పారిశ్రామిక వృద్ధి కేవలం 2.7 శాతం ► కొత్తగా 2011–12 బేస్ ఇయర్‌తో గణాంకాలు ► టోకు ద్రవ్యోల్బణ గణాంకాల బేస్ ఇయర్నూ 2011–12గా సవరింపు ► ఏప్రిల్‌లో టోకు ధరలు 3.85 శాతమే ► ఇదే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 2.99 శాతం ► రెపో రేటు తగ్గింపునకు మళ్లీ డిమాండ్ న్యూఢిల్లీ: దేశ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) లెక్కలు మార్చి నెలవి కాగా, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం అంకెలు ఏప్రిల్‌కు సంబంధించినవి. ఐఐపీ, టోకు ద్రవ్యోల్బణాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడం గణాంకాల్లో ప్రత్యేకాంశం. ఇంతక్రితం ఈ రెండు సూచీలకూ బేస్ ఇయర్‌గా 2004–05గా ఉండేది. ఈ బేస్ ఇయర్ తాజాగా 2011–12గా మారింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి ఇప్పటికే 2011–12 బేస్ ఇయర్‌గా అమలవుతోంది. ఇక మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి అతి తక్కువగా 2.7 శాతంగా నమోదయితే, ఏప్రిల్‌లో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కేంద్రం, ఆర్బీఐ లక్ష్యాలకు అనుగుణంగా వరుసగా 3.85 శాతం, 2.99 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ది తగ్గడంతో మరోమారు రెపో రేటు (ప్రస్తుతం 6.25 శాతం)ను తగ్గించాలని ఆర్బీఐని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. మూడు విభాగాలకు సంబంధించి తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే... పారిశ్రామిక రంగానికి ‘తయారీ’ దెబ్బ ► మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరు మార్చి నెల ఐఐపీపై ప్రతికూల ప్రభావం చూపింది. 2016 మార్చిలో ఐఐపీ వృద్ధిరేటు 5.5 శాతంగా నమోదయితే ఇప్పుడు 2.7 శాతానికి పడిపోయింది. ► మార్చిలో తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి (2016 ఇదే నెలతో పోల్చి) పడిపోయింది. 2016 ఇదే నెలలో ఈ విభాగంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంది. ► విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 11.9% నుంచి 6.2%నికి Sతగ్గింది. ► మైనింగ్ రంగంలో వృద్ధి మాత్రం 4.7 శాతం నుంచి 9.7 శాతానికి పెరిగింది. వార్షికంగా చూస్తే...: 2016–17 మొత్తంగా చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి 3.4 శాతం నుంచి (2015–16లో) 5 శాతానికి పెరిగింది. వార్షికంగా తయారీ రంగం వృద్ధి 3 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగం ఉత్పత్తి స్వల్పంగా 5.7 శాతం నుంచి 5.8 శాతానికి ఎగసింది. వార్షికంగా మైనింగ్ రంగం వృద్ధి రేటు 4.3 శాతం నుంచి 5.3 శాతానికి చేరింది. కొత్త వస్తువుల్లో ఇవి..: కొత్త సిరిస్‌లో ఒక్క తయారీ రంగంలోనే 809 వస్తువులు ఉన్నాయి. ఇంతక్రితం ఈ సంఖ్య 620గా ఉండేది. 149 కొత్త ప్రొడక్టుల్లో స్టెరాయిడ్స్, సిమెంట్ క్లింకర్స్, మెడికల్ లేదా సర్జికల్ వస్తువులు వంటివి ఉన్నాయి. రిటైల్ ధరలు తగ్గాయ్... ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.89 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 2.99 శాతానికి తగ్గింది. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు భారీగా 15.94 శాతం మేర తగ్గాయి. కూరగాయల ధరల తగ్గుదల 8.59 శాతంగా ఉంది. ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 6.13 శాతంగా నమోదయ్యింది. పండ్ల ధరలు 3.78 శాతం ఎగశాయి. మొత్తంగా చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 1.93 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 0.61 శాతంగా నమోదయ్యింది. టోకు ధరలు... 4 నెలల కనిష్టం... టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.85 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 ఏప్రిల్‌తో పోల్చితే 2017 ఏప్రిల్‌లో టోకు బాస్కెట్ ధరలు మొత్తంగా 3.85 శాతం పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. ముఖ్యాంశాలు చూస్తే... ♦ మార్చిలో ఈ రేటు 5.29 శాతంగా ఉంది. ♦ టోకు ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు మార్చిలో 3.82 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 1.16 శాతానికి తగ్గింది. పప్పు దినుసుల ధరలు 13.64 శాతం, కూరగాయలు (7.78 శాతం), ఆలూ (40.97 శాతం), ఉల్లి (12.47శాతం) ధరలు తగ్గడం (వార్షికంగా) దీనికి కారణం. ♦ ఇక ఇంధనం, విద్యుత్ విభాగంలో రేటు 18.52 శాతంగా నమోదయితే, తయారీ రంగంలో ఈ రేటు 2.66 శాతంగా ఉంది. 199 కొత్త ఐటమ్స్‌లో కాకర, దోస, టిష్యూ పేపర్ కొత్త ఇండెక్స్ బాక్స్‌లో 697 వస్తువులు చేరాయి. ఇందులో ప్రైమరీ ఆర్టికల్స్‌లో 117 వస్తువులు ఉండగా, ఇంధన విభాగంలో 16 ఐటమ్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో 564 ఐటమ్స్ ఉన్నాయి. డబ్ల్యూపీఐ కొత్త సిరీస్‌లో 199 కొత్తగా వచ్చి చేరాయి. ఇందులో టిష్యూ పేపర్, గ్యాస్. కన్వేయర్ బెల్ట్, రబ్బర్ థ్రెడ్, స్టీల్ కేబుల్స్, దోసకాయ, కాకరకాయ, పనస ఉన్నాయి. తొలగించిన వస్తువుల్లో వీడియో సీడీ ప్లేయర్, పటికబెల్లం, లైట్ డీజిల్ ఆయిల్ వంటివి ఉన్నాయి. ఇక గణాంకాలకు తీసుకునే కోట్స్ పెరిగాయి. బేస్ ఇయర్ మార్పు ఎందుకు? గణాంకాల్లో మరింత స్పష్టత, పారదర్శకత, కాలానికి అనుగుణంగా సరైన గణాంకాలను వెలువరించడం బేస్ ఇయర్ మార్పు లక్ష్యం. ఉదాహరణకు ఇప్పటి వరకూ 2004–05 మూల సంవత్సరంగా తీసుకుని ఒక స్థిర ధరల వద్ద అటు తర్వాత సంవత్సరాల్లో ధరల్లో మార్పును శాతాల్లో పేర్కొంటారు. అయితే బేస్ ఇయర్¯ మార్పు వల్ల గణాంకాల్లో మరింత స్పష్టత వస్తుంది. -
పారిశ్రామికోత్పత్తి వృద్ధి పెరిగింది..?
నవంబర్‌లో 5.7 శాతం • లెక్కలను విడుదల చేసిన కేంద్ర గణాంకాల శాఖ • కనిపించని నోట్ల రద్దు ప్రభావం • తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల దన్ను • క్యాపిటల్ గూడ్స్‌దీ అప్‌ట్రెండే..! న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దీనితో పారిశ్రామికవృద్ధి తీవ్రంగా దెబ్బతింటుందన్న భయాలు నెలకొన్నాయి. అయితే ఇలాంటిదేమీ లేదని కేంద్ర గణాంకాల శాఖ నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గణాంకాలు వెల్లడించాయి. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 5.7 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీరంగం సహా మైనింగ్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు వెల్లడించాయి. కాగా 2016 అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి అసలు లేకపోగా (–)1.8 శాతం క్షీణత నమోదయ్యింది. బేస్ ఎఫెక్టే కారణమా? 2015 నవంబర్ ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా (–) 3.4 శాతం క్షీణత నమోదయ్యింది (2014 నవంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే). 2015 నవంబర్‌లో అసలు వృద్ధిలేకపోవడం వల్ల దానితో పోల్చి 2016 నవంబర్‌లో ఏ కొంచెం విలువ వృద్ధి నమోదయినా... అది శాతాల్లో అధికంగా ఉంటుందన్నది గమనార్హం. దీనినే బేస్ ఎఫెక్ట్‌గా పరిగణిస్తారు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే... పారిశ్రామిక వృద్ధి 0.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 3.8 శాతం. వృద్ధి పుంజుకుంటుంది: ఫిక్కీ తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక వేదిక ఫిక్కీ ఒక నివేదిక విడుదల చేస్తూ... భవిష్యత్తుపై విశ్వాస ధోరణిని వ్యక్తం చేసింది. ‘‘పలు బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గించాయి. దీనితో వినియమ, పెట్టుబడుల డిమాండ్ పెరుగుతుంది. రానున్న నెలల్లో తయారీ రంగం వృద్ధికి దోహదపడే చర్య ఇది. వడ్డీరేట్ల విషయమై ఆర్బీఐ మరింత సరళతర విధానాన్ని అవలంభిస్తుందని భావిస్తున్నాం. దీనితో వృద్ధి మరింత పుంజుకుంటుంది’’ అని ఫిక్కీ తన ఈ ప్రకటనలో పేర్కొంది. -
అప్రమత్తం అవసరం
ఆర్థిక వ్యవస్థపై పలు సంస్థల సూచన న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివిధ విశ్లేషణా సంస్థలు కీలక సంకేతాలను పంపాయి. ఆయా అంశాలకు సంబంధించి పరిస్థితి మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించాయి. పారిశ్రామిక వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని ఇండ్-ఆర్ఏ పేర్కొంటే... ద్రవ్యోల్బణం కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచించింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్య స్థిరత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అభిప్రాయపపడింది. ఐఐపీపై ఇప్పుడే ఆశల్లేవు: ఇండ్-ఆర్ఏ మే నెలలో 1.1 శాతం వృద్ధి, జూన్‌లో 2.1 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం ‘ప్లస్’లోకి వచ్చినప్పటికీ, ఈ ధోరణి కొనసాగడంపై స్పష్టతలేదని పేర్కొంది. తగిన వర్షపాతం నమోదయినప్పటికీ కొన్ని ముఖ్య నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉందని వివరించింది. సరఫరాల్లో సమస్యలు, బ్లాక్‌మార్కెటింగ్ వంటి అంశాలు ఇందుకు కారణంగా చూపింది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది: కొటక్ కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఎగువముఖంగానే పయనించే అవకాశం ఉందని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన ఒక నివేదికలో పేర్కొంది. -
పరిశ్రమల వృద్ధి పడిపోయింది!!
♦ మేలో 2.8 శాతానికి పడిపోయిన ♦ 8 పరిశ్రమల వృద్ధి రేటు ♦ గతేడాది మేలో ఇది 4.4 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు మే నెలలో నిరాశపరిచింది. 2015 మే నెలనాటి 4.4 శాతంతో పోలిస్తే 2016 మేలో వృద్ధిరేటు 2.8 శాతంగా నమోదయింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గతేడాది డిసెంబర్లో గ్రూప్ వృద్ధి రేటు 0.9 శాతం. ఆ తర్వాత ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదు ఇదే తొలిసారి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో 8.5 శాతం వృద్ధి నమోదవడంతో ఈ రంగం రికవరీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మరుసటి నెలలోనే ఈ అంచనాలు నీరుగారిపోయాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల వాటా దాదాపు 38 శాతం. వివిధ పరిశ్రమల పనితీరు వేర్వేరుగా... ⇒ ఎరువుల రంగంలో వృద్ధి భారీగా 14.8 %గా నమోదయింది. 2015 మేలో ఈ రేటు 1.3%. ⇒ స్టీల్ రంగంలో ఈ వృద్ధి రేటు 2 శాతం నుంచి 3.2 శాతానికి పెరిగింది. ⇒ రిఫైనరీ ప్రొడక్టుల విభాగంలో 1.2% వృద్ధి (2015 మేలో 7.8% వృద్ధి) నమోదయ్యింది. ⇒ సిమెంట్ రంగంలో వృద్ధి 2.4 శాతం. 2015 మేలో ఈ రేటు 2.7 శాతం. ⇒ విద్యుత్‌లో వృద్ధి రేటు 2015 మేలో 6% ఉండగా, 2016 మేలో 4.6%కి తగ్గింది. ⇒ బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి రేటు 7.6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింది. ⇒ క్రూడ్ ఆయిల్ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా -3.3 శాతం క్షీణించింది. -
మైనస్‌లోనే పరిశ్రమలు..!
♦ రెండోనెలా ఐఐపీ తిరోగమనం ♦ డిసెంబర్లో 1.3 శాతం క్షీణత న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్‌లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమయ్యాయి. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం గతేడాది డిసెంబర్లో ఐఐపీ 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి 3.1 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2.6 శాతమే. ఇక ఐఐపీలోని వివిధ విభాగాల పనితీరు చూస్తే.. ♦ యంత్ర పరికరాల ఉత్పాదకత క్షీణతలోకి జారిపోయింది. డిసెంబర్లో ఏకంగా 19.7 శాతం తగ్గింది. క్రితం ఏడాది డిసెంబర్లో ఇది 6.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ♦ సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉండే తయారీ రంగం మైనస్‌లో 2.4 శాతం క్షీణించింది. గతంలో 4.1 శాతం వృద్ధి నమోదైంది. ♦ క్రితం డిసెంబర్లో 1.7 శాతం క్షీణించిన మైనింగ్ రంగం ఈసారి 2.9 శాతం వృద్ధి సాధించింది. విద్యుదుత్పత్తి విభాగం వృద్ధి 3.2 శాతానికి పరిమితమైంది. గతంలో ఇది 4.8 శాతం. వినియోగ ఆధారిత వర్గీకరణను బట్టి ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి స్వల్పంగా 0.5 శాతం మేర పెరిగింది. వినియోగ వస్తువుల తయారీ 0.6 శాతం నుంచి 2.8 శాతానికి పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పాదకత మాత్రం మైనస్ 9.2 శాతం నుంచి వృద్ధిలోకి మళ్లి, ఏకంగా 16.5 శాతానికి ఎగిసింది. అయితే, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ విభాగం ఉత్పాదకత గతేడాది 5.6 శాతం వృద్ధి కనపర్చగా.. ఈసారి మాత్రం మైనస్ 3.2 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని ఇరవై రెండు పరిశ్రమల గ్రూప్‌లో పది ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. -
ఎన్నాళ్లు!
పడకేసిన పారిశ్రామిక ప్రగతి అడుగు ముందుకు పడని వ్యాగన్ వర్క్‌షాప్ {పారంభంకాని ఐటీ ఇంక్యూబేషన్ కేంద్రం నివేదికల దశలో మగ్గుతున్న టెక్స్టైల్ పార్క్ కారుచీకట్లో వరంగల్ పారిశ్రామిక కారిడార్ హన్మకొండ : జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. ఏళ్లు గడుస్తున్నా కొత్త పరిశ్రమలు రాక జిల్లాలోని యువతకు ఉపాధి కరువైంది. వ్యాగన్ వర్క్‌షాప్, టెక్స్టైల్స్ పార్క్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అంటూ నాయకులు పేర్లు వల్లించడం మినహా పురోగతి కనిపించడం లేదు.కొత్త పరిశ్రమలు కరువై హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ కారు చీకట్లో మగ్గుతోంది. ముందుపడని వర్కషాప్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న వ్యాగన్ వర్క్‌షాప్ ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. మడికొండ సమీపంలోని అయోధ్యపురంలో మెట్టురామలింగేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 54 ఎకరాల భూమిని పరిశ్రమ స్థాపనకు అనువైనదిగా ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని దేవాదాయశాఖ నుంచి రవాణాశాఖకు బదలాయించడానికే నాలుగేళ్లు పట్టింది. ఆర్నెళ్ల కిందట భూసేరణకు నిధులు మంజూరయ్యాయి. ఇక సర్వం సిద్ధం వ్యాగన్ పరిశ్రమ నెలకొల్పడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వాధినేతలు, రెవెన్యూ యంత్రాంగం హడావుడి చేసింది. వ్యాగన్ పరిశ్రమకు కేటాయించిన స్థలంలో ఉన్న ఇళ్లను కూల్చివేశారు. సంబంధింత పొలాల్లో కౌలు చేస్తున్న రైతులను వ్యవసాయానికి దూరం పెట్టారు. ఆర్నెళ్లు గడిచినా పురోగతి లేదు. ప్రాజెక్టు పనులు త్వరిగతగిన చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపించడం లేదు. అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాల వల్ల వరంగల్ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీనితో రైల్వేశాఖపై ఒత్తిడి లేదు. కానరాని కమిటీ వస్త్ర పరిశ్రమకు వరంగల్‌ను హాబ్‌గా తయారు చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా 2015 జనవరిలో హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్, అనుబంధ పరిశ్రమలు వీటికి సంబంధించిన టౌన్షిప్ తదితర నిర్మాణాల కోసం ఒకే చోట 2 వేల ఎకరాల స్థలం అన్వేషించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అంతేకాకుండా దేశంలో వస్త్ర పరిశ్రమకు కేంద్రాలుగా విరాజిల్లుతున్న సోలాపూర్, సూరత్, తిర్పూర్‌లలో పర్యటించేందుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం, అప్పటి ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో స్థ్థానిక ప్రజాప్రతినిధులను చేర్చి కమిటీ వేశారు. వస్త్ర పరిశ్రమ తీరుతెన్నులూ, వరంగల్‌లో నెలకొల్పబోయే పరిశ్రమలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ 2015 జనవరి 30లోగా ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంది. ఆర్నెళ్లు గడుస్తున్నా నివేదిక సమర్పించ లేదు. మరోవైపు 2వేల ఎకరాల స్థలసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. పురుడుపోసుకోని ఇంక్యూబేషన్ వరంగల్ నగరంలో ఐటీ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు 2013 మేలో రూ. 5.60 కోట్ల వ్యయంతో ఇంక్యూబేషన్ సెంటర్ నిర్మాణం ప్రారంభించారు. నేటి యువతలో క్రేజ్ ఉన్న ఐటీ పరిశ్రమ వరంగల్ నగరంలో వేళ్లూనుకునేందుకు ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ అప్పట్లో ఢంకా భజాయించారు. ప్రస్తుతం మడికొండలోని పారిశ్రామిక వాడలో ఇంక్యుబేషన్ సెంటర్ భవన నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. 1500 అడగుల వర్కింగ్ ప్లేస్ ఇక్కడ అందుబాటులో ఉంది. నిరంతరం విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్ పనులు పూర్తయ్యాయి. కానీ వరంగల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆకర్షించేందుకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం జరగ లేదు. అడిగేవారు కరువైపోవడంలో నిర్మాణం మొత్తం పూర్తైనా అరకొరగా మిగిలిన విద్యుత్ వైరింగ్ పనులను నెలలతరబడి చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ప్రకటించినందున .. వరంగల్‌లో ఐటీ పరిశ్రమలు వచ్చేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. -
రేట్ల కోతకు సమయమిదే
-
రేట్ల కోతకు సమయమిదే
- దీన స్థితిలో పారిశ్రామిక వృద్ధి - తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతంత మాత్రంగా ఉన్న పారిశ్రామిక వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించడానికి ఇది సరైన సమయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. జూన్ 2న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైట్లీ పాల్గొన్నారు. పాలసీ రేట్లను తగ్గించాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. దీనిపై తన అభిప్రాయం అందరికీ తెలుసని, ఇది సరైన సమయమని పేర్కొన్నారు. 2015లో ఆర్బీఐ ఇప్పటిదాకా రెండు సార్లు పాలసీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు (ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 7.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి ఆశించిన దానికంటే తక్కువగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్బీఐ పాలసీని కాస్త సరళతరంగా చేసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టమైన 4.87 శాతానికి దిగి రాగా, మార్చిలో పారిశ్రామికోత్పత్తి అయిదు నెలల కనిష్టమైన 2.1 శాతానికి పడిపోయింది. ఈ పరిణామాలతో జూన్ 2న ఆర్బీఐ రెపో రేటును కనీసం పావు శాతం తగ్గించవచ్చని భావిస్తున్నట్లు ఎస్బీఐ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. మొండి బకాయిలపై ఇప్పుడే ఏమీ చెప్పలేం.. బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో మొండి బకాయిల (ఎన్పీఏలు) స్థాయి డిసెంబర్ త్రైమాసికంలో 5.64% స్థాయికి ఎగియగా, మార్చి త్రైమాసికంలో ఇవి 5.2%కి తగ్గిందని జైట్లీ తెలిపారు. అయినప్పటికీ.. ఇది కూడా చాలా ఎక్కువేనని పేర్కొన్నారు. గత త్రైమాసికంలో ఇవి తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ, పరిస్థితులు పూర్తిగా మెరుగుపడుతున్నట్లుగా ఇప్పుడే భావించలేమని జైట్లీ వ్యాఖ్యానించారు. ఎకానమీని వృద్ధి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నంలో కొన్ని సంకేతాలు అస్పష్టంగానే ఉంటాయన్నారు. -
పారిశ్రామిక వృద్ధి.. ప్చ్!
మార్చిలో 2.1 శాతం; 5 నెలల కనిష్టస్థాయి ఇది... ⇒ 2014-15 ఏడాదికి వృద్ధి రేటు 2.8% న్యూఢిల్లీ: తయారీ, యంత్రపరికరాల రంగాలు కాస్త పుంజుకున్నప్పటికీ.. పరిశ్రమల పనితీరు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు(ఐఐపీ) 2.1 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.86 శాతం(సవరణకు ముందు 5%)గా నమోదైంది. అయితే, గతేడాది ఐఐపీ మైనస్ 0.5 క్షీణతలో ఉండటం గమనార్హం. మంగళవారం కేంద్రీయ గణాంకాల సంస్థ ఈ వివరాలను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో మైనస్ 2.7 శాతంగా ఉన్న ఐఐపీ.. నవంబర్‌లో 5.2 శాతం, డిసెంబర్లో 3.56 శాతం, జనవరిలో 2.77 శాతం చొప్పున వృద్ధి చెందింది. దీని ప్రకారం చూస్తే మార్చి గణాంకాలు ఐదు నెలల కనిష్టస్థాయి కింద లెక్క. రంగాల వారీగా చూస్తే... తయారీ: గతేడాది మార్చిలో ఈ పరిశ్రమల ఉత్పాదకత మైనస్ 1.3 శాతం కాగా.. ఈ ఏడాది మార్చిలో 2.2 శాతానికి వృద్ధి చెందింది. మొత్తం ఐఐపీ సూచీలో తయారీ వాటా 75 శాతానికిపైగా ఉంది. తయారీ రంగంలో మొత్తం 22 పరిశ్రమల విభాగాలకుగాను 13 వృద్ధి బాటలో(ఫిబ్రవరితో పోలిస్తే) ఉన్నాయి. యంత్ర పరికరాలు: ఈ ఏడాది మార్చిలో 7.6 శాతం వృద్ధి చెందింది. గతేడాది మార్చిలో మైనస్ 11.5 శాతం భారీ క్షీణతలో ఉంది. మైనింగ్: ఉత్పాదకత వృద్ధి 0.5 శాతం నుంచి 0.9 శాతానికి స్వల్పంగా పెరిగింది. విద్యుత్: ఉత్పాదకత వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. కన్సూమర్ గూడ్స్: మార్చిలో ఈ రంగం ఉత్పాదకత మైనస్ 0.7 శాతం క్షీణించింది. గతేడాది మార్చిలో ఈ క్షీణత మైనస్ 2.2 శాతం. కన్సూమర్ నాన్డ్యూరబుల్స్: ఉత్పాదకత వృద్ధి రేటు 5 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో క్షీణత తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చిలో ఉత్పాదకత మైనస్ 11.8% కాగా, ఈ మార్చిలో ఇది మైనస్ 4.7 శాతంగా ఉంది. పూర్తి ఏడాదికి ఇలా... గత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఉత్పాదకత మైనస్ 0.1 శాతం క్షీణించింది. ఇక తయారీ రంగం ఉత్పాదకత మైనస్ 0.8 శాతం నుంచి 2.3 శాతం వృద్ధిలోకి వచ్చింది. యంత్రపరికరాల ఉత్పాదకత కూడా మైనస్ 3.6 శాతం నుంచి 6.2 శాతం వృద్ధి చెందింది. మైనింగ్ రంగం 1.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 8.4 శాతానికి ఎగబాకింది. రేట్ల కోత అంచనాలకు బలం రిటైల్ ధరలు ఏప్రిల్‌లో నాలుగు నెలల కనిష్ట స్థాయికి తగ్గడం... పారిశ్రామిక ఉత్పత్తి మార్చిలో మందగమనంలో ఉన్న నేపథ్యంలో... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)పై మళ్లీ పారిశ్రామిక ప్రతినిధులు, విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతల దృష్టి సారిస్తున్నారు. ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో మందగించిన పారిశ్రామిక ఉత్పత్తికి ఉత్తేజాన్ని ఇవ్వడానికి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ఊతం అందించడానికి ఆర్బీఐ మరోదఫా పాలసీ రేటును తగ్గించే అవకాశం ఉందని వారు అంచనాలు వేస్తున్నారు. జూన్ 2 పాలసీ సమీక్షకు ఆర్బీఐ తాజా ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుందని భావిస్తున్నారు. జనవరి నుంచీ ఆర్బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది. అయితే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడంలో తొలుత బ్యాంకులు వెనుకంజవేసాయి. రెపో రేటు తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. -
కొండల మధ్య కోరుకున్న జీవితం
దశాబ్దం క్రితం పారిశ్రామిక ప్రగతి నేపథ్యంలో లక్షల మంది చైనీయులు పట్టణబాట పట్టారు. వీరిలో కొంతమంది అక్కడ మనలేకపోయారు. కొండలమధ్యన ఉన్న సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. నూడుల్స్ తింటున్న ఈ మహిళ కూడా అలాంటి వారిలో ఒకరు. కరెంటు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల మధ్య కోరిమరీ జీవిస్తున్న తమకు ఎనలేని ప్రశాంతత ఉందని వీరు చెబుతారు. -
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు!
జిల్లా పారిశ్రామిక ప్రగతిపై చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడంపై విమర్శలు అధికారం చేపట్టకముందే ప్రారంభమైన పరిశ్రమలను జపాన్ పర్యటనతో సాధించినట్లు చంద్రబాబు గొప్పలు న్యాయస్థానంలో వివాదంలో ఉన్న భూమిని కేటాయించడంపై హీరో మోటో కార్ప్ యాజమాన్యం కినుక డీఆర్డీవో లేబొరేటరీని ఒక్కోసారి ఒక్కో జిల్లాలో ఏర్పాటుకు భూములను పరిశీలిస్తున్న ఆ సంస్థ ప్రతినిధి బృందం మన్నవరం ప్రాజెక్టు రెండో దశలో పెట్టుబడులు ఇప్పట్లో పెట్టలేమని ఎన్బీపీపీఎల్ తేల్చిచెప్పినా పట్టించుకోని సీఎం ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడమంటే ఇదే..! అధికారం చేపట్టక ముందే ప్రారంభమైన పరిశ్రమలను తాను జపాన్‌లో పర్యటించి సాధించినట్లు చంద్రబాబు గొప్పలకు పోయారు. జిల్లాను ఆటోమొబైల్ హబ్‌గా మార్చుతానని ప్రకటించిన సీఎం.. ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం వివాదాస్పద భూములు కేటాయించడంతో హీరో సంస్థ కినుక వహించినట్లు అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. శ్రీరంగరాజపురం మండలం కొక్కిరాలకొండలో ఏర్పాటుచేస్తామన్న డీఆర్డీవో ల్యాబొరేటరీ ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో నెలకొల్పుతామంటూ ఆ సంస్థ ప్రతినిధి బృందం ప్రకటిస్తూ.. భూములను పరిశీలిస్తోంది. ఇదొక పార్శ్వమైతే.. మన్నవరం ప్రాజెక్టు రెండో దశ పనులను ఇప్పట్లో చేపట్టలేమని ఎన్బీపీపీఎల్ చేతులెత్తేసినా చంద్రబాబు నోరుమెదపడం లేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. తన ఏడు నెలల పాలనలో పారిశ్రామిక ప్రగతిలో జిల్లా దూసుకుపోతున్నట్లు డిసెంబర్ 10న తిరుపతిలో నిర్వహించిన సీఐఐ సదస్సులో చంద్రబాబు గొప్పలు చెప్పడం గమనార్హం. తిరుపతి: ఐదు మిషన్లు, ఏడు కార్యక్రమాలతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ.. ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని అమలుచేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పసిగట్టిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను శ్రమిస్తున్నాననే భావన కలిగించి ప్రజల దృష్టి మరల్చేందుకు విదేశీ పర్యటనలకూ.. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకూ వెళ్తున్నారు. ఆ పర్యటనలతో భారీ ఎత్తున పరిశ్రమలను సాధిం చినట్లు.. వాటిలో అధికశాతం జిల్లాలో ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కనికట్టు కాదా..? జిల్లాలో శ్రీసిటీ సెజ్‌లో రూ.1,500 కోట్ల వ్యయంతో ఇసుజు సంస్థ వాహనాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకొచ్చిం దని.. కొబెల్కో క్రేన్స్ సంస్థ కూడా కర్మాగారాన్ని నెలకొల్పేందుకు అంగీకరించిందని చం ద్రబాబు ప్రకటించారు. జపాన్ పర్యటనలో ఆ సంస్థల యాజమాన్యంతో చర్చించడం వల్లే ఆ పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని సెలవిచ్చారు. కానీ.. వాస్తవం ఏంటంటే.. చంద్రబాబు తాను సాధించాననని చెబుతోన్న పరిశ్రమల పనులు శ్రీసిటీ సెజ్‌లో ఇప్పటికే ప్రారంభం కావడం గమనార్హం. శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఇసుజు సంస్థ ప్రతినిధులు జనవరి 28, 2013న భూమి పూజ చేశారు. రూ.1,500 కోట్ల వ్యయంతో ఏడాదికి 1.20 లక్షల వాహనాల(80 దేశంలో విక్రయించేందుకు.. 40 వేల వాహనాలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు) తయారీ సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటుచేయడానికి మార్చి 15, 2013న అప్పటి పరిశ్రమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ఇసుజు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం శ్రీసిటీ సెజ్‌లో ఆ పరిశ్రమ పనులు సాగుతున్నాయి. కొబెల్కో క్రేన్స్ పరిశ్రమ 2012లో శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటైంది. ఇప్పటికే వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. శ్రీసిటీ సెజ్‌లో మరో పది ఎకరాలను కేటాయిస్తే పరిశ్రమను విస్తరిస్తామని 2013లో ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. కానీ.. భూకేటాయింపుల్లో జాప్యం చోటుచేసుకోవడంతో విస్తరణకు నోచుకోలేదు. ఇప్పుడు అదే ప్రతిపాదనను కొబెల్కో ప్రతినిధులు చేయడం గమనార్హం. హీరో మోటో కార్ప సంస్థ జిల్లాలో రూ. 1600 కోట్లతో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కానీ.. ఆ సంస్థకు సత్యవేడు మండలం మాదన్నపాళెంలో 600ఎకరాల వివాదాస్పద భూములను ప్రభుత్వం కేటాయించింది. సుప్రీంకోర్టులో ఆ భూములు వివాదంలో ఉండటాన్ని పసిగట్టిన హీరో యాజమాన్యం.. ఆ భూములను పరిశీలించేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. నోరుమెదపరెందుకు బాబూ జిల్లాలో డీఆర్డీవో ల్యాబొరేటరీ ఏర్పాటుకు కలికిరి మండలం టేకులకోన, ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండ వద్ద భూమిని కేటాయించేందుకు 2010లోనే ప్రభుత్వం అంగీకరించింది. అప్పట్లో కుదిరిన ఎంవోయూ మేరకే డీఆర్డీవో ప్రయోగశాలకు ఎస్ఆర్పురం మండలం కొక్కిరాలకొండ వద్ద 1100 ఎకరాలను కేటాయిస్తూ ఆగస్టు 13న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఠచిత్తూరు జిల్లాలో కొక్కిరాలకొండ వద్ద డీఆర్డీవో ప్రయోగశాలను ఏర్పాటుచేస్తున్నట్లు సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. కానీ.. ఇంతలోనే ఆ ప్రయోగశాలను వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కొప్పర్తి పారిశ్రామికవాడలో 2,500 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించేందుకు సిద్ధమని చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు కొప్పర్తి పారిశ్రామికవాడను డీఆర్డీవో బృందం పరిశీలించింది. పోనీ.. అక్కడితోనైనా ఆగారా అంటే అదీ లేదు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కొలనుపాక వద్ద డీఆర్డీవో ప్రయోగశాల ఏర్పాటుకు నవంబర్ 28న ఆ సంస్థ ప్రతినిధులు భూమిని పరిశీలించారు. 2,500 ఎకరాల భూమిని కేటాయిస్తే రూ.468 కోట్ల వ్యయంతో ప్రయోగశాలను ఏర్పాటుచేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. చిత్తూరుజిల్లాలో డీఆర్డీవో ప్రయోగశాలకు భూమిని కేటాయించి.. ఇప్పుడేమో కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. దేశానికే తలమానికంగా నిలుస్తుందనుకున్న మన్నవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఏటా ఐదు వేల మెగావాట్లు పెంచేలా పరికరాలను తయారుచేసే లక్ష్యంతో ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), బీహెచ్ఈల్(భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)లు సంయుక్తంగా రూ.ఆరు వేల కోట్ల వ్యయంతో మన్నవరంలో 2010లో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టులో తొలి దశలో రూ.1200 కోట్ల వ్యయంతో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఏహెచ్‌పీ), వాటర్ సిస్టమ్‌ను తయారుచేయాలన్నది లక్ష్యం. ఈ పనులు 2012 నాటికే పూర్తికావాలి. కానీ.. ఇప్పటిదాకా తొలి దశ పనులు పూర్తికాలేదు. ఎల్ అండ్ టీ, భారత్ పోర్జ్, బీజీఆర్, తోషిబా వంటి సంస్థలు ఇప్పటికే బాయిలర్లు, జనరేటర్లు, టర్బై న్లును తయారుచేస్తుండటం.. విద్యుత్ రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రూ.4,800 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన రెండో దశ పనులను ఇప్పట్లో చేపట్టలేమంటూ ఈనెల 8న ఆ సంస్థ ప్రకటించినా చంద్రబాబు నోరుమెదపడం లేదు. ఇదీ చంద్రబాబుకు జిల్లా పారిశ్రామికాభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి..! -
‘ప్రకాశం’లో పారిశ్రామిక వికాసం
ఒంగోలు: గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని రానుందనే విషయంపై స్పష్టత రావడంతో, పారిశ్రామికవేత్తల దృష్టి ప్రకాశం జిల్లాపై పడింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం పలువురు పారిశ్రామికవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నట్లు తెలిసింది. గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ఏర్పాటుకు 7,500 ఎకరాలను సేకరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో ఈ భూములను సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా విశాఖపట్నం తరహాలో ఫార్మా సిటీ ని కూడా ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. విశాఖలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో వీరంతా కాబోయే రాజధానికి దగ్గరలో ఉన్న ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఎకరా భూమి ధర రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ పలుకుతోంది. బల్క్ డ్రగ్‌లను తయారు చేయడానికి ఒంగోలు, నెల్లూరు, కృష్ణా తీర ప్రాంతాలే అనువుగా ఉంటాయని ఫార్మా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిమ్జ్, ఫార్మా సిటీలతో పాటు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో కూడా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాబోయే రాజధానికి దగ్గరగా ఉండటం ఒక కారణమైతే, ఈ ప్రాంతంలో సహజ వనరులు ఎక్కువగా లభిస్తాయనేది మరో కారణం. ఈ జిల్లా ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు లాభసాటిగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు అనుబంధమైన పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారు. విశాఖ, చెన్నై కారిడార్ ద్వారా సీమాంధ్ర మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాకు మరింతగా అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవడం ద్వారా జిల్లాలో నిరుద్యోగ సమస్యలను అధిగమించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా చేనేత అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయంటున్నారు. చీరాల, పేరాల ప్రాంతాల్లో తయారవుతున్న వస్త్రాలు కర్ణాటక రాష్ట్రానికి తరలివెళ్లి, అక్కడ నుంచి రెడీమేడ్ దుస్తులు తయారుచే సి, వాటిని తిరిగి ప్రకాశం జిల్లాలో కూడా విక్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా, ఇక్కడే రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. గత యూపీఏ ప్రభుత్వం చీరాల వద్ద టెక్స్టైల్ పార్కును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పరిశ్రమలు తరలి వచ్చే అవకాశాలే ఎక్కువ భవిష్యత్తులో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. చేనేత అనుబంధమైన సంస్థలు ఇక్కడకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. గ్రానైట్, లేత్ పరిశ్రమలతో పాటు, పలకలు, టెక్స్టైల్ పార్కులు రావడానికి అనువైన ప్రదేశంగా ఈ జిల్లాను గుర్తించారు. కోటి రూపాయల లోపు పెట్టుబడితో వచ్చే పరిశ్రమలకు సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. రామాయపట్నం పోర్టు ఇక్కడే ఏర్పడితే, పరిశ్రమల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. - బొలిశెట్టి గౌరీశంకర్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ -
ఈ ఏడాది వృద్ధి 5.3%
ఐక్యరాజ్యసమితి: భారత్ వృద్ధి 2014లో 5.35% అని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. 2015లో ఈ రేటును 5.7%గా అంచనావేసింది. అయితే ఊహించినదానికన్నా తక్కువగా భారత్ వృద్ధి రేటు ఉందని విశ్లేషించింది. ‘ఐక్యరాజ్యసమితి- 2014 ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు’ పేరుతో వెల్లడయిన నివేదిక ముఖ్యాంశాలు... భారత్ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుత స్థాయి నుంచి మరింత కిందకు పడిపోయే అవకాశం లేదు. పెట్టుబడుల్లో రికవరీ, పటిష్ట ఎగుమతుల వృద్ధి రేటు, తగిన వర్షపాత పరిస్థితులు కొనసాగుతాయి. క్రమంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఈ పరిస్థితులు దోహదపడతాయి. బలహీన గృహ వినియోగం, పెట్టుబడుల్లో ఇబ్బందులు ఇప్పటివరకూ వృద్ధి పునరుత్తేజానికి అవరోధంగా నిలిచాయి. విదేశీ పరిస్థితుల ప్రభావం దేశంపై ఉంటుంది. ద్రవ్యలోటును 2013-14లో జీడీపీలో 4.8% వద్ద కట్టడి చేయలేకపోవచ్చు. వృద్ధి బలహీనత దీనికితోడు రూపాయి బలహీనత, సబ్సిడీల భారం వంటి అంశాలు ఈ అంచనాలకు కారణం.