ఈ ఏడాది వృద్ధి 5.3% | Indian economy projected to grow at 5.3% in 2014 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వృద్ధి 5.3%

Published Sat, Jan 25 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

ఈ ఏడాది వృద్ధి 5.3%

ఈ ఏడాది వృద్ధి 5.3%

ఐక్యరాజ్యసమితి: భారత్ వృద్ధి 2014లో 5.35% అని ఐక్యరాజ్యసమితి నివేదిక  పేర్కొంది. 2015లో ఈ రేటును 5.7%గా అంచనావేసింది. అయితే ఊహించినదానికన్నా తక్కువగా భారత్ వృద్ధి రేటు ఉందని విశ్లేషించింది. ‘ఐక్యరాజ్యసమితి- 2014 ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు’ పేరుతో వెల్లడయిన నివేదిక ముఖ్యాంశాలు...
 

  • భారత్ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుత స్థాయి నుంచి  మరింత కిందకు పడిపోయే అవకాశం లేదు.
  •  పెట్టుబడుల్లో రికవరీ, పటిష్ట ఎగుమతుల వృద్ధి రేటు, తగిన వర్షపాత పరిస్థితులు కొనసాగుతాయి. క్రమంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఈ పరిస్థితులు దోహదపడతాయి.
  • బలహీన గృహ వినియోగం, పెట్టుబడుల్లో ఇబ్బందులు ఇప్పటివరకూ వృద్ధి పునరుత్తేజానికి అవరోధంగా నిలిచాయి.
  • విదేశీ పరిస్థితుల ప్రభావం దేశంపై ఉంటుంది.
  • ద్రవ్యలోటును 2013-14లో జీడీపీలో 4.8% వద్ద కట్టడి చేయలేకపోవచ్చు. వృద్ధి బలహీనత దీనికితోడు రూపాయి బలహీనత,  సబ్సిడీల భారం వంటి అంశాలు ఈ అంచనాలకు కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement