2017–18లో వృద్ధి 7.4 శాతం: ఇండ్–రా
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికవృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) 7.4 శాతంగా నమోదవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) మంగళవారం పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను మాత్రం 7.9 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర గణాంకాల విభాగం అంచనా 7.1 శాతంకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. వినియోగ డిమాండ్, ప్రభుత్వ వ్యయాల పెంపు వంటి కారణాల వల్ల వచ్చే ఏడాది వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలో వృద్ధిరేటు వరుసగా 3%, 6.1%, 9.1%గా నమోదవుతాయన్న అంచనాలను వెలువరించింది.