హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్, కార్బన్ ప్రొడక్టులను ఉత్పత్తి చేసే రెయిన్ ఇండస్ట్రీస్ మార్చితో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 7% క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 35 కోట్లుగా ఉన్న లాభం (కన్సాలిడేటెడ్) ఇప్పుడు రూ. 32 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 274 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు పెరిగింది. కార్బన్ ప్రోడక్టుల మార్జిన్లు తగ్గడం, సిమెంట్ విభాగం ఉత్పత్తి తగ్గడం లాభాలు క్షీణించడానికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది.