సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారులుగా ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఎంపికయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నియామకాలను క్యాబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఈ నియామకాలను ఆమోదించింది. భాస్కర్ ఖుల్బే, అమర్‌జీత్ సిన్హాను ప్రధాని సలహాదారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రారంభంలో రెండేళ్ల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వుల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లు అయిన ఇద్దరూ 1983 బ్యాచ్‌కు చెందినవారు. ఖుల్బే పశ్చిమ బెంగాల్ కేడర్ చెందిన వారు కాగా, సిన్హా బీహార్ కేడర్‌కు చెందినవారు. సిన్హా గత సంవత్సరం గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఖుల్బే పీఎంఓలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment