Asia cup : 11వ సారి ఫైనల్లోకి.. టైటిల్‌ కోసం టీమిండియాతో పోరు | Asia Cup 2023, SL vs Pak: Sri Lanka win by 2 wickets against Pakistan | Sakshi
Sakshi News home page

Asia cup : 11వ సారి ఫైనల్లోకి.. టైటిల్‌ కోసం టీమిండియాతో పోరు

Published Fri, Sep 15 2023 1:36 AM | Last Updated on Fri, Sep 15 2023 12:06 PM

Sri Lanka win by 2 wickets against Pakistan - Sakshi

కొలంబో: ఆసియా కప్‌ ఫైనల్‌ మరోసారి భారత్, శ్రీలంక మధ్య జరగనుంది. గురువారం హోరాహోరీగా సాగిన ‘సూపర్‌–4’ మ్యాచ్‌లో లంక 2 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి ఈ టోర్నీలో 11వ సారి(వన్డే ఫార్మాట్‌) ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి బంతి వరకు  ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో చివరకు లంకదే పైచేయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ముందుగా 45 ఓవర్లకు, ఆ తర్వాత 42 ఓవర్లకు కుదించారు.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (73 బంతుల్లో 86 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్‌ (69 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (40 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒకదశలో జట్టు స్కోరు 130/5 కాగా... రిజ్వాన్, ఇఫ్తికార్‌ ఆరో వికెట్‌కు 108 పరుగులు జోడించి ఆదుకున్నారు.

అనంతరం లంక లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ ద్వారా 42 ఓవర్లలో 252 పరుగులుగా నిర్దేశించారు. లంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు సాధించి గెలిచింది. కుశాల్‌ మెండిస్‌ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్‌), సదీరా సమరవిక్రమ (51 బంతుల్లో 48; 4 ఫోర్లు), అసలంక (47 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో శ్రీలంక నాలుగు పాయింట్లతో ‘సూపర్‌–4’ దశలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నిష్క్రమించాయి.  

స్కోరు వివరాలు 
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: షఫీక్‌ (సి) మదుషన్‌ (బి) పతిరణ 52; ఫఖర్‌ (బి) మదుషన్‌ 4; బాబర్‌ (స్టంప్డ్‌) మెండిస్‌ (బి) వెలలాగె 29; రిజ్వాన్‌ (నాటౌట్‌) 86; హారిస్‌ (సి అండ్‌ బి) పతిరణ 3; నవాజ్‌ (బి) తీక్షణ 12; ఇఫ్తికార్‌ (సి) షనక (బి) పతిరణ 47; షాదాబ్‌ (సి) మెండిస్‌ (బి) మదుషన్‌ 3; షాహిన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (42 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–9, 2–73, 3–100, 4–108, 5–130, 6–238, 7–243. బౌలింగ్‌: మదుషన్‌ 7–1–58–2, తీక్షణ 9–0–42–1, షనక 3–0–18–0, వెలలాగె 9–0–40–1, పతిరణ 8–0–65–3, ధనంజయ 6–0–28–0.  

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి అండ్‌ బి) షాదాబ్‌ 29; పెరీరా (రనౌట్‌) 17; మెండిస్‌ (సి) హారిస్‌ (బి) ఇఫ్తికార్‌ 91; సమరవిక్రమ (స్టంప్డ్‌) రిజ్వాన్‌ (బి) ఇఫ్తికార్‌ 48; అసలంక (నాటౌట్‌) 49 ; షనక (సి) నవాజ్‌ (బి) ఇఫ్తికార్‌ 2; ధనంజయ (సి) వసీమ్‌ (బి) షాహిన్‌ 5; వెలలాగె (సి) రిజ్వాన్‌ (బి) షాహిన్‌ 0; మదుషన్‌ (రనౌట్‌) 1; పతిరణ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (42 ఓవర్లలో 8 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–20, 2–77, 3–177, 4–210, 5–222, 6–243, 7–243, 8–246.  బౌలింగ్‌: షాహిన్‌ 9–0–52–2, జమాన్‌ 6–1–39–0, వసీమ్‌ 3–0–25–0, నవాజ్‌ 7–0–26–0, షాబాద్‌ 9–0–55–1, ఇఫ్తికార్‌ 8–0–50–3.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement