బంగ్లాదేశ్ యువ పేసర్ షోహిదుల్ ఇస్లాంపై ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అనర్హత వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కావడంతో ఐసీసీ అతనిపై 10 నెలల నిషేధం విధించింది. ఈ ఏడాది మే 28 నుంచి పది నెలల పాటు నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించింది. అనర్హత వేటు అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని వివరించింది. బంగ్లాదేశ్ తరఫున ఓ టీ20 ఆడిన 27 ఏళ్ల షోహిదుల్.. 2023 మార్చి 28 తర్వాతే మైదానంలోకి అడుగపెట్టాలని ఆదేశించింది.
డోపింగ్ నిరోధక కోడ్ ఆర్టికల్ 2.1ని ఉల్లంఘించిన నేరాన్ని షోహిదుల్ అంగీకరించిన తరువాత ఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. షోహిదుల్ మూత్ర నమూనాలో నిషేధిత పదార్థం క్లోమిఫెన్ ఉన్నట్లు ఐసీసీ నిర్ధారించింది. కాగా షోహిదుల్ ఇస్లాం ఇటీవల న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల్లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే జట్టు సమీకరణల్లో భాగంగా అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు.
చదవండి: WC 2023: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన!
Comments
Please login to add a commentAdd a comment