
ముంబై: ఐసీసీ అవార్డుల్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ అవార్డుల్లో దుమ్ము దులిపారు. కోహ్లికి స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, రోహిత్‌కి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు దక్కాయి. కాగా.. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్ ఐదు సెంచరీలతో ఆకట్టుకోగా, కోహ్లీ అటు టెస్ట్‌ల్లో, వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తాజాగా మరోసారి ఐసీసీ అవార్డుల్లో కూడా హవా చూపారు.
Comments
Please login to add a commentAdd a comment