Team India Batsman
-
ఫాదర్ ఆఫ్ రింకుసింగ్
ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రింకుసింగ్ తండ్రి ఖాన్చందర్సింగ్ ఇప్పటికీ ఆలిగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్)లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చందర్‌సింగ్ ఎల్పీజి సిలిండర్లు డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చందర్ వృత్తినిబద్ధతకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు రెస్ట్ తీసుకోండి అని నాన్నకు చాలాసార్లు చెప్పాను. అయితే పనిని ప్రేమించే నాన్న విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించారు. పని చేస్తేనే నేను చురుగ్గా ఉంటాను అని చెబుతుంటారు’ అంటున్నాడు రింకుసింగ్. ‘కాస్త పేరు, కాస్త డబ్బు రాగానే చాలామంది గతాన్ని మరిచిపోయి గర్వంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి ఈ చిన్న వీడియో క్లిప్ కనువిప్పు కలిగిస్తుంది’ ‘కొడుకును ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా తయారుచేయడానికి ఈ తండ్రి ఎంతో కష్టపడి ఉంటాడు. అప్పుడూ , ఇప్పుడూ తన సొంత కష్టాన్నే నమ్ముకున్నాడు. గ్రేట్ ఫాదర్!’...కామెంట్ సెక్షన్లో ఇలాంటివి చాలా కనిపించాయి. -
ఐసీసీ అవార్డ్స్‌లో కోహ్లి, రోహిత్ హవా..!
ముంబై: ఐసీసీ అవార్డుల్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ అవార్డుల్లో దుమ్ము దులిపారు. కోహ్లికి స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, రోహిత్‌కి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు దక్కాయి. కాగా.. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్ ఐదు సెంచరీలతో ఆకట్టుకోగా, కోహ్లీ అటు టెస్ట్‌ల్లో, వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తాజాగా మరోసారి ఐసీసీ అవార్డుల్లో కూడా హవా చూపారు. -
రాయుడు అవుటా... డౌటా?
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడే వన్డేలో టీమిండియా బ్యాట్స్ మన్ అంబటి రాయుడు వివాదస్పదరీతిలో అవుటయ్యాడు. కెప్టెన్ ధోనితో కలిసి భారీ స్కోరుకు బాటలు వేసిన రాయుడు అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. 43.3 ఓవర్ లో మొర్తజా వేసిన బంతిని షార్ట్ ఫైన్ గా ఆడేందుకు రాయుడు ప్రయత్నించాడు. వికెట్లను వదిలి పక్కకు జరిగి బంతిని కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రాయుడు తొడ భాగం వద్ద తగిలి తర్వాత వికెట్ కీపర్ చేతిలో పడింది. బంగ్లా ఆటగాళ్లు గట్టిగా అప్పీలు చేయడంతో అంపైర్ అవుట్ ప్రకటించారు. అంపైర్ నిర్ణయంపై రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ ధోని కూడా అంపైర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అయితే బంతి రాయుడు ప్యాడ్లకు తగల్లేదని రీప్లేలో కనబడింది. దీనిపై 'బంతి మిర్పూర్ లో, బ్యాట్ ఢాకాలో ఉంటే అంపైర్ అవుట్ ఇచ్చారు' కామెంటేటర్ ఒకరు వ్యాఖ్యానించారు. అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాయుడు తన మ్యాచ్ ఫీజులో కొంత వదులుకోవాల్సి రావచ్చు అంటూ చమత్కరించారు.