బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్- టీమిండియాతో పుణె వేదికగా మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 27.4 ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్లో ఓపెనర్ లిటన్ దాస్(66) అవుట్ కాగా.. ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చాడు.
ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. 29.4 ఓవర్ వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రెండు పరుగులు తీశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా ముష్ఫికర్ రహీం కంటే ముందు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు షకీబ్ వరల్డ్‌కప్ చరిత్రలో 1201 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే.. 42.3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ముష్ఫికర్ రహీం 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్(42.3)లో అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.
చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment