కాన్పూర్ వేదికగా భారత్‌తో రెండో టెస్టులో తలపడేందుకు బంగ్లాదేశ్‌తలపడేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కాన్పూర్ చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు పర్యాటక బంగ్లా జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయమైంది. స్పిన్‌కు స్వర్గధామమైన చెపాక్ లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను కేవలం 21 ఓవర్లే వేయగలిగాడు.
షకీబ్ నొప్పితో బాధపడూతూనే మ్యాచ్‌లో కొనసాగాడు. అయితే తన గాయం నుంచి షకీబ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని బంగ్లా హెడ్ కోచ్ హతురుసింఘే ధ్రువీకరించారు.
"రెండో టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉంటాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఏ బెంగా లేదన్నాడు. తొలిటెస్టులో మా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేకపోయారు. అందుకే ఓడిపోయాం. ఇప్పుడు కాన్పూర్ టెస్టులో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉందని" హతురుసింఘే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment