ICC World Cup 2023 Winner Prediction: మరో రెండు రోజుల్లో వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబరు 5న ఈ మెగా క్రికెట్ సమరం మొదలుకానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే టాప్-4 జట్లు, విజేతపై విశ్లేషకులు సహా అభిమానులు సైతం తమ అంచనాలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ గ్రీన్‌స్టోన్ లోబో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అతడే వరల్డ్‌కప్ గెలుస్తాడు
లోబో అంచనా ప్రకారం.. 1987వ సంవత్సరంలో జన్మించి.. ఇప్పుడు ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుస్తాడట. ఇందుకు ఉదాహరణలు చెబుతూ.. 1986, 1987లో జన్మించిన ప్లేయర్లు, క్రీడా జట్లకు నాయకులుగా ఉన్న వాళ్లు మేజర్ స్పోర్ట్ ఈవెంట్లలో విజేతలుగా నిలుస్తున్నారని లోబో పేర్కొన్నాడు.
జొకోవిచ్, మెస్సీ అలాగే..
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. 1987లో పుట్టిన టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ హ్యూగో లోరిస్(1986), 2022లో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ(1987)ల పేర్లను లోబో ఉటంకించాడు.
మోర్గాన్ కూడా అంతే
ఇక క్రికెట్‌లో ఇందుకు ఉదాహరణగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరును అతడు ప్రస్తావించాడు. 1986లో జన్మించిన మోర్గాన్ 2019లో ఆ జట్టును జగజ్జేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ ప్రకారం.. ఈసారి 1987లో జన్మించిన వ్యక్తి కప్ గెలుస్తాడంటూ లోబో జోస్యం చెప్పాడు.
షకీబ్ 1987లో జన్మించాడు.. అయితే..
ఈ మేరకు.. ‘‘ షకీబ్ అల్ హసన్ 1987లో జన్మించాడు. అయితే, బంగ్లాదేశ్ జట్టు మరీ అంత గొప్పగా ఏమీ లేదు. కాబట్టి 1987లో జన్మించిన మరో కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ టైటిల్’’ అంటూ టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరును చెప్పకనే చెప్పాడు లోబో.
కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ మార్చి 24, 1987లో జన్మించగా.. రోహిత్ శర్మ ఏప్రిల్ 30, 1987లో పుట్టాడు. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక అక్టోబరు 8న టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
చదవండి: టీమిండియా స్టార్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి!
Comments
Please login to add a commentAdd a comment