షకీబ్ జోరు.. న్యూజిలాండ్ బేజారు | Shakib Al Hasan hits double century | Sakshi
Sakshi News home page

షకీబ్ జోరు.. న్యూజిలాండ్ బేజారు

Published Fri, Jan 13 2017 10:45 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

షకీబ్ జోరు.. న్యూజిలాండ్ బేజారు

షకీబ్ జోరు.. న్యూజిలాండ్ బేజారు

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ డబుల్ సెంచరీ(207 నాటౌట్: 263 బంతుల్లో 30 ఫోర్లు)  సాధించాడు. బంగ్లా తరఫున ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా నిలిచాడు షకీబ్. కివీస్ బౌలర్ గ్రాండ్ హోమ్మీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఈ అరుదైన మార్క్ ను చేరుకున్నాడు. ఈ క్రమంలో మరిన్ని ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బంగ్లా ఆటగాడిగానూ రికార్డులు సవరించాడు. గతంలో తమీమ్ ఇక్బాల్ (206) పేరిట ఉన్న రికార్డును షకీబ్ బద్ధలుకొట్టాడు.    తమీమ్ ఇక్బాల్(206), బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్(200) మాత్రమే గతంలో డబుల్ సెంచరీ చేసిన బంగ్లా ఆటగాళ్లు.

డబుల్ సెంచరీ సాధించే క్రమంలో టెస్ట్ కెరీర్ లో మూడు వేల పరుగులు  పూర్తిచేసుకున్న మూడో బంగ్లా క్రికెటర్ గానూ వ్యక్తిగత రికార్డును నెలకొల్పాడు షకీబ్. గతంలో బంగ్లా తరఫున తమీమ్ ఇక్బాల్, హబీబుల్ బషర్ మాత్రమే టెస్టుల్లో ఈ ఫీట్ సాధించారు. అయితే షకీబ్ బౌలింగ్ లోనూ రాణించి 159 వికెట్లు సాధించడం విశేషం. డబుల్ సెంచరీ హీరో షకీబ్, కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ(159) తో కలిసి ఐదో వికెట్ కు బంగ్లా తరఫున 359 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. 130 ఓవర్లలో బంగ్లా 5 వికెట్లు కోల్పోయి 531 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement