
'ఏదో ఒక రోజున ఓడిస్తాం'
కాన్ బెర్రా: పటిష్టమైన ఆస్ట్రేలియా ఓడించే సత్తా తమకుందని బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం అన్నాడు. తమదైన రోజున ఆసీస్ ను కూడా కట్టడి చేస్తామని దీమా వ్యక్తం చేశాడు. తాజా ప్రపంచకప్ లో అప్ఘానిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్ 105 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 56 బంతుల్లో 71 పరుగులు చేసిన ముష్ఫికర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.
బిస్బ్రేన్ లో శనివారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టబోతోంది. ఆసీస్ ను ఆపడం కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదని ముష్ఫికర్ అన్నాడు. ఏదో ఒక రోజున కంగారూలను ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.