భారత్ ఓడిపోవడమే అతనికి ఆనందమట!
బౌలర్ల వైఫల్యంతో టీమిండియా సెమీస్‌లో పరాభవాన్ని మూటగట్టుకుంది. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ లెండ్ల్ సిమన్స్ 51 బంతుల్లో 82 పరుగులు చేసి.. అద్భుతంగా రాణించడంతో కరేబియన్ జట్టు ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్ ఇలా ముగిసిందో లేదో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ట్విట్టర్‌లో ఓ తీవ్ర వ్యాఖ్య చేశాడు. 'ఆనందమంటే ఇదే.. హాహాహా! సెమీస్‌లో భారత్ ఓడిపోయింది' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై వెంటనే ట్విట్టర్‌లో దుమారం రేపింది. అప్పటికే భారత్ ఓటమితో నిరాశచెందిన అభిమానులకు ఈ ట్వీట్ మరింత ఆగ్రహం కలిగించింది. రహీమ్ తీరును తప్పుబడుతూ వాళ్లు కామెంట్ చేశారు.
దీంతో రహీమ్ తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. తాను ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. ' అందరికీ సారీ.. వెస్టిండీస్‌కు నేను పెద్ద మద్దతుదారుడిని. అయినప్పటికీ పరుషమైన వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నా' అని పేర్కొన్నారు. అయితే, ముష్ఫికర్ రహీమ్ ట్వీట్‌ను తప్పబడుతూ టీమిండియా అభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
Indian fans to Mushfiqur Rahim .... #WT20 #INDvWI pic.twitter.com/vSm1m38Kvz
— Taimoor Zaman (@taimoorza1) 31 March 2016
Happiness is this....!!!!!! #ha ha ha..!!!! @mushfiqur15 pic.twitter.com/1Fi8Sy6DVK
— Ankur Singh (@iAnkurSingh) 31 March 2016