
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన షోర్‌ఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో.. ఆఖరి బంతికి కుశాల్ పెరీరా ఆఫ్ సైడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది.
ఈ క్రమంలో వికెట్ల వెనుక ఉన్న ముష్ఫికర్ రహీమ్ తన ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్క షాక్‌కు గురయ్యాడు. ముష్పికర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది.
లంక బ్యాటర్లలో అసలంక(108) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నిస్సాంక(41), సమరవిక్రమ(41) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్, షోర్‌ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: #Timed Out: కనీవినీ ఎరుగని రీతిలో! మాథ్యూస్‌ను చూసి నవ్వుకున్న షకీబ్.. అలా అనుకున్న వాళ్లదే తప్పు!