
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. బ్యాటర్‌ను మన్కడింగ్(రనౌట్) చేసే అవకాశం ఉన్నప్పటికీ స్టార్క్ కేవలం వార్నింగ్‌తో మాత్రమే సరిపెట్టాడు.
ఏం జరిగిందంటే?
శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో నాలుగో బంతిని స్టార్క్ వేయడానికి సిద్దమయ్యాడు. అయితే స్టార్క్ బంతి డెలివరీ చేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కుశాల్ పెరీరా క్రీజును వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్టార్క్ బంతిని విసరకుండా ఆగిపోయాడు.
అలా అని మన్కడింగ్(రనౌట్) కూడా చేయలేదు. వెంటనే పెరీరా వైపు చూసి మరోసారి అలా చేయవద్దు అంటూ హెచ్చరించాడు. అదే విధంగా ఫీల్డ్ అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. కాగా క్రీడా స్పూర్తి ప్రదర్శించిన స్టార్క్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కొత్త నిబంధనల ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగిణిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: WC 2023: వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే: భారత మాజీ క్రికెటర్
— Ishan Martinez (@IshanMarti66419) October 16, 2023