ఢాకా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (84; 4 ఫోర్లు, సిక్స్), మహ్ముదుల్లా (54; 2 ఫోర్లు, సిక్స్), తమీమ్ ఇక్బాల్ (52; 6 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 48.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మిరాజ్ (4/30), ముస్తఫిజుర్ (3/34) లంకను దెబ్బతీశారు.
ఇక అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ముష్ఫికర్ రహీమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ అంత ఈజీ వికెట్ కాదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయాం. అయితే, మేం నిలదొక్కుకున్నాం. తమీమ్, రియాద్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక నా విషయానికి వస్తే.. భారీ షాట్లు ఆడేందుకు నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్‌ను కాదు. నా బలాలు ఏంటో నాకు తెలుసు. ముఖ్యంగా వికెట్ కాపాడుకుంటూ, పరుగులు రాబట్టాలని ఆలోచించాను. అదే చేశాను. నిజంగా ఇదొక మంచి గేమ్. మిరాజ్, ముస్తఫిజుర్, సైఫుద్దీన్ కూడా రాణించారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment