బంగ్లాతో మ్యాచ్‌: పాకిస్తాన్‌ లక్ష్యం 240 | Pakistan Target 240 Runs Against Bangladesh | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 26 2018 8:59 PM | Last Updated on Wed, Sep 26 2018 8:59 PM

Pakistan Target 240 Runs Against Bangladesh - Sakshi

ముస్తాఫికర్‌ రహీమ్‌

అబుదాబి : ఆసియాకప్‌లో భాగంగా ఫైనల్‌ పోరు కోసం జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ (4/20) దాటికి బంగ్లా 239 పరుగులకు ఆలౌట్‌ అయింది. ముస్తాఫికర్‌ రహీమ్‌ 99(116 బంతుల్లో 9 ఫోర్లు), మహ్మద్‌ మిథున్‌ 60(84 బంతులు, 4 ఫోర్లు), మహ్మదుల్లా (25)లు రాణించడంతో బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. కష్టాల్లో ఉన్న బంగ్లాను రహీమ్‌, మిథున్‌లు ఆదుకున్నారు.

ఈ క్రమంలో రహీమ్‌ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.  పాక్‌ బౌలర్లలో జునైద్‌ ఖాన్‌ నాలుగు, సహీన్‌ షా అఫ్రిది, హసన్‌ అలీ రెండు వికెట్లు తీయగా షాదబ్‌కాన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో భారత్‌ ఫైనల్‌ ఆడనుందన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement