
దుబాయ్: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్..మరో ఘనతను కూడా సాధించాడు. ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రహీమ్ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రహీమ్(144) భారీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించడమే కాకుండా, ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(183) తొలి స్థానంలో ఉండగా, యూనిస్ ఖాన్(144) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రహీమ్ నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్(143)ను రహీమ్ అధిగమించాడు.
చదవండి: సూపర్ ముష్ఫికర్
Comments
Please login to add a commentAdd a comment