రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాను ఆదిలోనే పేసర్ ఖుర్రం షాజాద్ దెబ్బకొట్టాడు.
ఓపెనర్ జకీర్ హోస్సేన్, కెప్టెన్ శాంటోను ఔట్ చేసి బంగ్లాను బ్యాక్ ఫుట్‌లో ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ షాద్మాన్ ఇస్లాం(93), మోమినుల్ హక్(50) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పాక్ బౌలర్లకు ధీటుగా బదులిచ్చారు.
షాద్మాన్, మోమినుల్ ఔటైన తర్వాత వారి బాధ్యతను లిట్టన్ దాస్, ముష్పికర్ రహీమ్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ముగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ కంటే బంగ్లా ఇంకా 132 పరుగులు వెనకబడి ఉంది.
ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్(52), ముష్పికర్ రహీమ్(55) పరుగులతో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఖుర్రం షాజాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అయూబ్, మహ్మద్ అలీ తలా వికెట్ సాధించారు. కాగా పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment