ఇండోర్: టెస్టు క్రికెట్‌లో సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు చేసి రికార్డులు నెలకొల్పడం ఒకటైతే, జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేయడం మరొకటి. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముష్పికర్ రహీమ్.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఒకవైపు బంగ్లా టాపార్డర్ ఆటగాళ్లు వరుస విరామాల్లో పెవిలియన్ చేరిన వేళ.. ముష్ఫికర్ ఎంతో బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో 105 బంతులు ఆడి 43 పరుగులు చేసిన ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌ల్లో కూడా అదే తరహాలో ఆడుతున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్ స్కోరర్‌గా నిలిచిన ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌ల్లో కూడా ఆ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వందకు పైగా బంతులు ఆడిన రహీమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 53 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ సమయానికి ముష్ఫికర్ 114 బంతులు ఆడి 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసి ఆటగాడిగా నిలవడమే కాకుండా, ‘సెంచరీ’కి పైగా బంతులు ఆడటం విశేషం. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వందకు పైగా బంతుల్ని ఎదుర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment