తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్‌ | Bangladesh captain Mushfiqur Rahim hospitalised after head blow | Sakshi
Sakshi News home page

తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్‌

Published Mon, Jan 16 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్‌

తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్‌

వెల్లింగ్టన్‌: బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్‌ చివరి రోజు సోమవారం న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీం గాయపడ్డాడు. రహీం బౌన్సర్ను ఎదుర్కొనే క్రమంలో అతని తల వెనుక భాగంలో హెల్మెట్కు బంతి తగలడంతో కుప్పకూలిపోయాడు. ఇరు జట్ల వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి పరుగులు పెట్టి రహీంకు ప్రథమ చికిత్స చేశారు. వెంటనే అంబులెన్స్లో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ హఠాత్పరిణామంతో మ్యాచ్ 20 నిమిషాలు ఆగిపోయింది.

రహీంకు ఎలాంటి ప్రమాదం లేదని, క్షేమంగా ఉన్నారని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. బంగ్లాదేశ్లోని రహీం కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పినట్టు తెలిపారు. రహీంకు ఎక్స్ రే, ఇతర వైద్య పరీక్షలు చేశారని చెప్పారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెప్పినట్టు వెల్లడించారు. కాగా ఇదే మ్యాచ్లో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ ఇమ్రుల్‌ కేస్‌ కాలికి గాయం కావడంతో అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement