Bangladesh captain
-
పార్లమెంట్ ఎన్నికల బరిలో షకీబ్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. త్వరలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అతను పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున అతను బరిలోకి దిగుతాడు. తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గానికి సంబంధించి షకీబ్‌కు టికెట్ ఖరారైంది. జనవరి 7న బంగ్లాలో ఎన్నికలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో వేలికి గాయమైన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షకీబ్ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్‌తో ఇంటా, బయటా జరిగే వరుస సిరీస్‌లకు అతను అందుబాటులో ఉంటాడా అనేది చెప్పలేదు. షకీబ్‌కు ముందు అతని సహచర ఆటగాడు, మాజీ కెపె్టన్ మష్రఫ్ మొర్తజా గత ఎన్నికల్లో నరైల్ స్థానంనుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈ సారి కూడా అతను మళ్లీ బరిలో నిలిచాడు. మూడు ఫార్మాట్లో కలిపి బంగ్లా తరఫున 430 మ్యాచ్‌లు ఆడిన 14,406 పరుగులు చేయడంతో పాటు 690 వికెట్లు తీసిన షకీబ్ ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
అరుదైన క్లబ్లో చేరిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశీగా రికార్డు
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్ ఈ మైలురాయిని అధిగమించాడు. Congratulation Tamim Iqbal on becoming the first Bangladeshi batsman to complete 15000 runs in International Cricket. 🔥🏏#BCB | #Cricket pic.twitter.com/J4mj5W8k9T — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తమీమ్.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు. తమీమ్ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 383 మ్యాచ్‌లు ఆడిన తమీమ్ 15009 పరుగులు చేశాడు. తమీమ్.. 69 టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో రెండో వన్డేలో ముష్ఫికర్ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్), లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్‌కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
Asia Cup 2022: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ ఆల్ హసన్..
బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్ వ్యవహరించనున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. కాగా జింబాబ్వే పర్యటనకు ముందు బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహ్మదుల్లా తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా వికెట్ కీపర్ నూరల్ హసన్‌ను బీసిబీ నియమించింది. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో నూరల్ హసన్ చేతి వేలికి గాయమైంది. అనంతరం అతడికి సింగపూర్‌లో సర్జరీ నిర్వహించారు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనున్నట్లు బీసిబీ వైద్య బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు త్వరలో జరగనున్న ఆసియాకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షకీబ్‌ను తమ కెప్టెన్‌గా నియమిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా షకీబ్ అల్ హసన్ 'బెట్విన్నర్ న్యూస్’ అనే బెట్టింగ్ సంస్థతో ఒప్పందం కుదర్చుకుని వివాదంలో చిక్కున్నాడు. ఈ క్రమంలో ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే బోర్డు కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు నిషేధం విధిస్తామని షకీబ్‌ను బంగ్లా క్రికెట్ బోర్డు హెచ్చరించింది. దీంతో అతడు వెనుక్కి తగ్గి ఒప్పందం రద్దు చేసుకున్నాడు. దీంతో అతడిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చదవండి: IND vs PAK: మ్యాచ్‌కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్ -
ఇక సంచలనం అనకండి: మొర్తజా
లండన్: ఇకపై తమ జట్టు పెద్ద జట్లను ఓడిస్తే అది సంచలనం కానే కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా అన్నాడు. ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ‘క్రికెట్లో బంగ్లా సాధించిన ప్రగతి ఇది. ఇంకా దీన్ని మీరు ఆశ్చ ర్యంగానో, సంచలనంగానో చూడొద్దు. మేం సర్వశక్తులు ఒడ్డితే ఏదైనా సాధిస్తామని మాకు తెలుసు. కానీ కొందరు బంగ్లా బాగును కోరుకోవట్లేదు. అయితే మేం మాత్రం ఆటపైనే దృష్టిసారిస్తాం. ఎవరేమనుకుంటే మాకేంటి’ అని మొర్తజా అన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ఆట ఎదుగుతూ వచ్చిందని ఆల్‌రౌండర్ షకీబ్ తెలిపాడు. ఆ మెగా ఈవెంట్లో బంగ్లాదేశ్... భారత్, దక్షిణాఫ్రికాలను కంగుతినిపించింది. -
మార్గదర్శకుడు మొర్తజా!
గుంపు మనస్తత్వం ప్రమాదకరమైనది. అది కొన్ని పదాలకున్న అర్ధాలను మారుస్తుంది. ప్రతీకలకు కొత్త భాష్యం చెబుతుంది. సందేహాలను లేవనెత్తేవారిని అనుమానంతో చూస్తుంది. ప్రశ్నించడం ద్రోహమంటుంది. దాడులకు దిగు తుంది. వర్తమానంలో ఈ గుంపు మనస్తత్వం నీడ పడని చోటంటూ లేదు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మష్రఫె మొర్తజా చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ గుంపు మనస్తత్వం మన దగ్గర మాత్రమే కాదు... ఆ దేశంలో కూడా ఎంతగా వేళ్లూనుకుందో, అది ఎంతటి సమస్యగా మారిందో అర్ధమవుతుంది. మొర్తజా ఆ వ్యాఖ్యల్లో క్రికెట్‌కూ, దేశభక్తికీ ముడిపెట్టే తీరును ప్రశ్నించాడు. ఒక వైద్యుడితో, శ్రామికుడితో పోలిస్తే తాము చేస్తున్నదేమీ లేదని తేల్చిచెప్పాడు. నిజమైన దేశభక్తి ఎలాంటి చర్యల్లో ఇమిడి ఉంటుందో హితవు చెప్పాడు. అకారణంగా, అన వసరంగా ఏదో ఒక పేరు చెప్పి ఒక్కరిని లేదా కొందరిని లక్ష్యంగా చేసుకుని గుంపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఉదంతాల గురించి విని, చానెళ్లలో చూసి ఆందోళన పడుతున్నవారికి... ఒక రకమైన నిర్లిప్త స్థితికి, నిరాశామయ వాతా వరణంలోకి జారుకుంటున్నవారికి మొర్తజా చేసిన వ్యాఖ్యలు ఊరటనిస్తాయి. మన పొరుగునున్న ఒక చిన్న దేశం నుంచి ఇలాంటి వివేకవంతమైన స్వరం వినడం సంతోషం కలిగిస్తుంది. ఆ వ్యాఖ్యలు ఉన్మాదంలో కొట్టుకుపోతున్న వారికి మాత్రమే హితవచనాలు కావు... ఇలాంటి సమయాల్లో తమ బాధ్య తేమిటో గుర్తించని దేశదేశాల్లోని సెలబ్రిటీలకు సైతం కర్తవ్యాన్ని గుర్తు చేసే విలువైన మాటలు. మొర్తజా ప్రస్తావించిన ఈ దేశభక్తి సమస్య కంటే ముందు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రను స్పృశించాలి. క్రికెట్ ప్రపంచంలోకి బంగ్లాదేశ్ చాలా ఆలస్యంగా 1999లో అడుగు పెట్టింది. ఆ సంవత్సరం వరల్డ్ కప్‌లో బంగ్లా పాల్గొన్నది. ఆ మరుసటి ఏడాదికి టెస్ట్ క్రికెట్ ఆడే స్థాయికి చేరుకుంది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నప్పుడు...అంటే 1971కి ముందు ఆ ప్రాంతమంటే పాక్‌లో చిన్నచూపు. సైన్యంలోకైనా, క్రికెట్ టీంలోకి అయినా ‘అక్కడి’ నుంచి తీసుకోవడంపై అనధికార నిషేధం అమలయ్యేది. చాలా అరుదుగా మాత్రమే తూర్పు పాకిస్తాన్ యువకులకు చోటు దక్కేది. అది పశ్చిమ ప్రాంతానికీ, మరీ ముఖ్యంగా అక్కడ శిష్ట వర్గంగా చలామణి అయ్యేవారికీ పరిమితమయ్యేది. కనుకనే బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన రెండు దశాబ్దాల తర్వాతగానీ క్రికెట్ ప్రపం చంలోకి ఆ దేశం అడుగుపెట్టలేకపోయింది. అందుకు సంబంధించిన నైపుణ్యం అప్పటివరకూ పూర్తిస్థాయిలో దానికి పట్టుబడలేదు. అంతవరకూ బంగ్లా పౌరులు భారత్, పాకిస్తాన్ క్రికెట్ టీంలకు మద్దతుదార్లుగా ఉండేవారు. మతం కారణంగా లేదా మెరుగైన ఆట కనబరుస్తున్నారన్న కారణంగా ఎవరైనా పాకిస్తాన్ టీం నెగ్గాలని కోరుకుంటే అలాంటివారిని దేశ ద్రోహులుగా భావిం చేవారు. బంగ్లా టీంలు సైతం మైదానాల్లోకి రావడం మొదలెట్టాక పాకిస్తాన్‌పై క్రికెట్లో నెగ్గినవారినల్లా 1971లో పాక్ సైన్యం సాగించిన దౌష్ట్యాలకు ప్రతీకారం తీర్చుకున్నవారిగా పరిగణించే తత్వం పెరిగింది. ఇలాంటి విపరీత ధోరణులు రాను రాను మరింత బలపడుతున్నాయి. సరిహద్దుల్లో మన బీఎస్ఎఫ్ జవాన్లు బంగ్లాదేశ్ నుంచి వలసలను అరికట్టడానికి చర్యలు తీసుకున్నా, ఇరుపక్షాల మధ్యా ఎప్పుడైనా కాల్పులు జరిగినా వెనువెంటనే జరిగే క్రికెట్ క్రీడపై ఆ ప్రభావం ఉంటుంది. అలాంటపుడు తమ టీం ఉంటే సరేసరి... లేనట్టయితే పాకిస్తాన్ టీంను సమర్ధించడం సర్వ సాధారణం. మద్దతు ఎవరికని కాదు... ఆ మద్దతుదారు ఎవరిని వ్యతిరేకిస్తున్నాడన్నది ప్రధానమైపోతుంది. బంగ్లా హిందువులు భారత్ టీం ఆట తీరును మెచ్చుకుంటే వారికి దేశంకంటే మతం ప్రధానమైపోయిందన్న విమర్శలు మొదలవుతాయి. ఒక్కోసారి ఇది దాడుల వరకూ పోతుంది. మన దేశంలో ముస్లింలు అంతరాంతరాల్లో పాకిస్తాన్ అంటేనే మక్కువ చూపుతారని కొందరిలో ఉండే దురభిప్రాయంలాంటిదే ఇది కూడా. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇది మరింత వెర్రితలలు వేస్తోంది. ఫేస్‌బుక్‌లోనో, మరో చోటనో పెట్టే ఒక వ్యాఖ్య లేదా ఒక ‘లైక్’ ఆగ్రహావేశాలకూ, విద్వేషాలకూ దారితీస్తోంది. కేవలం సామాజిక మాధ్యమాలే కాదు... క్రికెట్ క్రీడతో అల్లుకుని ఉండే కార్పొరేట్ పెట్టుబడులు, లాభార్జన దృష్టి కూడా దాన్నొక క్రీడగా ఉండనివ్వడం లేదు. జాతీయతనో, దేశభక్తినో ప్రేరేపించడానికి అదొక సాకుగా మారింది. అందులో నెగ్గడంపైనే దేశ గౌరవప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయన్నంతగా ప్రచారం జరుగుతోంది. మన టీం నెగ్గితే వీధుల్లోపడి గంతులేయడం, ఓడిన దేశాన్ని కించపరుస్తూ, అవహేళన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం ఎక్కువవుతోంది. మన టీం ఓడితే ఆ క్రీడాకారులు ద్రోహులన్నట్టు అవమానిస్తూ మాట్లాడటం, టెలివిజన్ సెట్లు బద్దలు కొట్టడం దేశభక్తికి చిహ్నమవుతోంది. ప్రతిదీ లాభాలు ఆర్జించి పెట్టే సరుకుగా మారినచోట క్రికెట్ లేదా మరో క్రీడ దానికి అతీతంగా ఉండాలనుకోవడం అత్యాశే అయినా...నిష్కారణంగా కొంద రిని శత్రువులుగా, ద్రోహులుగా పరిగణించే మనస్తత్వం పెరగడం ఆందోళన కలిగిస్తుంది. సమాన సామర్ధ్యం గల రెండు టీంలు మైదానంలో నువ్వా నేనా అని తలపడుతుంటే దాన్ని ఆసక్తిగా తిలకించడం, ఆనందించడం, మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించినవారిని మెచ్చుకోవడం కనుమరుగవుతోంది. క్రికెట్ క్రీడాకారులు, బీసీసీఐ కూడా ఇలాంటి పెడ ధోరణులపై పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్క క్రికెట్ అనే కాదు... తినే తిండిని, కట్టే బట్టనూ, ఆచరించే సంస్కృతిని ఎత్తి చూపడం, దాడులకు దిగడం మన దేశంలో రివాజైంది. వీటన్నిటికీ కళ్లు మూసుకోవడం, మౌనంవహించడం బాధ్యతా రాహిత్యం అవుతుందని సెలబ్రిటీలు గమనించాలి. మొర్తజాను చూసైనా కర్తవ్యం గుర్తెరగాలి. -
తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్
-
తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్
వెల్లింగ్టన్: బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి రోజు సోమవారం న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీం గాయపడ్డాడు. రహీం బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో అతని తల వెనుక భాగంలో హెల్మెట్‌కు బంతి తగలడంతో కుప్పకూలిపోయాడు. ఇరు జట్ల వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి పరుగులు పెట్టి రహీంకు ప్రథమ చికిత్స చేశారు. వెంటనే అంబులెన్స్‌లో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ హఠాత్పరిణామంతో మ్యాచ్ 20 నిమిషాలు ఆగిపోయింది. రహీంకు ఎలాంటి ప్రమాదం లేదని, క్షేమంగా ఉన్నారని టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని రహీం కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పినట్టు తెలిపారు. రహీంకు ఎక్స్ రే, ఇతర వైద్య పరీక్షలు చేశారని చెప్పారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెప్పినట్టు వెల్లడించారు. కాగా ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ ఇమ్రుల్ కేస్ కాలికి గాయం కావడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.