
బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా
లండన్: ఇకపై తమ జట్టు పెద్ద జట్లను ఓడిస్తే అది సంచలనం కానే కాదని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా అన్నాడు. ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ‘క్రికెట్‌లో బంగ్లా సాధించిన ప్రగతి ఇది. ఇంకా దీన్ని మీరు ఆశ్చ ర్యంగానో, సంచలనంగానో చూడొద్దు. మేం సర్వశక్తులు ఒడ్డితే ఏదైనా సాధిస్తామని మాకు తెలుసు. కానీ కొందరు బంగ్లా బాగును కోరుకోవట్లేదు. అయితే మేం మాత్రం ఆటపైనే దృష్టిసారిస్తాం. ఎవరేమనుకుంటే మాకేంటి’ అని మొర్తజా అన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ఆట ఎదుగుతూ వచ్చిందని ఆల్‌రౌండర్ షకీబ్ తెలిపాడు. ఆ మెగా ఈవెంట్‌లో బంగ్లాదేశ్... భారత్, దక్షిణాఫ్రికాలను కంగుతినిపించింది.