ఒకే ఒక్కడు... ముష్ఫికర్ | 2 number of centuries for Mushfiqur Rahim against india, most for bangladesh | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు... ముష్ఫికర్

Published Sun, Feb 12 2017 10:58 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

ఒకే ఒక్కడు... ముష్ఫికర్

ఒకే ఒక్కడు... ముష్ఫికర్

హైదరాబాద్: భారత్ తో ఇక్కడ జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ నమోదు చేశాడు. 235 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ముష్ఫికర్ శతకం సాధించాడు. 322/6 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆదిలో రెండు వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు మెహిది హసన్ మిరాజ్(51) ఇన్నింగ్స్ ఆరంభించిన నాల్గో బంతికే భువనేశ్వర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆపై తైజుల్ ఇస్లామ్(10) ను ుమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. దాంతో బంగ్లాదేశ్ 339 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను నష్టపోయింది.

అయితే మరో ఓవర్ నైట్ ఆటగాడు ముష్ఫికర్ మాత్రం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ మార్కును చేరాడు. టెయిలెండర్ల సాయంతో క్రీజ్ ను అంటిపెట్టుకుని శతకం పూర్తి చేశాడు. ఇది ముష్ఫికర్ టెస్టు కెరీర్లో ఐదో సెంచరీ. కాగా, భారత్ పై రెండో సెంచరీ. తద్వారా భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఒకే ఒక్క బంగ్లా ఆటగాడిగా ముష్ఫికర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement