
వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్టు(PC: ICC)
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. కాగా మౌంట్ మాంగనీ వేదికగా విండీస్‌తో తలపడిన బంగ్లాదేశ్ మహిళా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు డియేండ్ర డాటిన్(17 పరుగులు), హేలీ మ్యాథ్యూస్(18 పరుగులు) శుభారంభం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్స్(4), ఆ తర్వాత కెప్టెన్ టేలర్(4) సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ నేనున్నానంటూ భరోసా ఇచ్చింది. 107 బంతులు ఎదుర్కొన్న ఆమె ఓపికగా పరుగులు తీస్తూ 53 పరుగులు సాధించింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టును విండీస్ బౌలర్ హేలీ మ్యాథ్యూస్ ఆదిలోనే దెబ్బకొట్టింది. ఓపెనర్లను వెనక్కి పంపింది. మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి బంగ్లా పతనాన్ని శాసించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 136 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా 4 పరుగుల తేడాతో విజయం విండీస్ సొంతమైంది. హేలీ మ్యాథ్యూస్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022
వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు
వెస్టిండీస్- 140/9 (50)
బంగ్లాదేశ్- 136 (49.3)
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment