Stafanie Taylor
-
వెస్టిండీస్ కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్..
వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్‌గా స్థాఫనీ టేలర్ శకం ముగిసింది. ఆమె స్థానంలో సారథిగా ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్‌ను క్రికెట్ వెస్టిండీస్ నిమించింది. 2012లో వెస్టిండీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన టేలర్ దాదాపు 10 ఏళ్ల పాటు సారథిగా సేవలు అందించింది. టేలర్ సారథ్యంలో 55 టీ20లు, 62 వన్డేల్లో తలపడిన విండీస్.. వరుసగా 29, 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆమె కెప్టెన్సీలో 2016 టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకుంది. ఇక మాథ్యూస్ గత కొన్నేళ్లుగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంది. మాథ్యూస్ ఇప్పటివరకు వెస్టిండీస్‌కు 69 వన్డేలు,61 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. "వెస్టిండీస్ మహిళల జట్టుకు కెప్టెన్‌గా అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జట్టును విజయ పథంలో నడిపించడానికి నా వంతు కృషిచేస్తాను. అదే విధంగా గత ఎనిమిదేళ్లగా టేలర్ సారథ్యంలో ఆడినందుకు గర్వపడుతున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో టేలర్ కీలక పాత్ర పోషించందని" మాథ్యూస్ పేర్కొంది. చదవండి: India Tour Of West Indies 2022: సర్కారు వారి ఛానల్లో టీమిండియా మ్యాచ్‌లు -
World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. 4 పరుగుల తేడాతో విజయం!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. కాగా మౌంట్ మాంగనీ వేదికగా విండీస్‌తో తలపడిన బంగ్లాదేశ్ మహిళా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు డియేండ్ర డాటిన్(17 పరుగులు), హేలీ మ్యాథ్యూస్(18 పరుగులు) శుభారంభం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్స్(4), ఆ తర్వాత కెప్టెన్ టేలర్(4) సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ నేనున్నానంటూ భరోసా ఇచ్చింది. 107 బంతులు ఎదుర్కొన్న ఆమె ఓపికగా పరుగులు తీస్తూ 53 పరుగులు సాధించింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టును విండీస్ బౌలర్ హేలీ మ్యాథ్యూస్ ఆదిలోనే దెబ్బకొట్టింది. ఓపెనర్లను వెనక్కి పంపింది. మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి బంగ్లా పతనాన్ని శాసించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 136 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా 4 పరుగుల తేడాతో విజయం విండీస్ సొంతమైంది. హేలీ మ్యాథ్యూస్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు వెస్టిండీస్- 140/9 (50) బంగ్లాదేశ్- 136 (49.3) చదవండి: View this post on Instagram A post shared by ICC (@icc) -
మిథాలీ రాజ్.. 16 ఏళ్లలో తొమ్మిదోసారి ‘టాప్’
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆమె.. తన 16 ఏళ్ల వన్డే కెరీర్లో తొమ్మిదోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. గతవారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ 30 పాయింట్లు కోల్పోవడంతో మిథాలీ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్‌లో నిలిచింది. 🔝 @M_Raj03 has regained her position as the No.1 batter on the @MRFWorldwide ICC Women's ODI Player Rankings. Full list: https://t.co/jxTLqOK1gm pic.twitter.com/oAHUTu4eRY — ICC (@ICC) July 20, 2021 కాగా, అంతకుముందు వారం పాక్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయమైన సెంచరీ సాధించడం ద్వారా స్టెఫానీ గతవారం టాప్ ర్యాంక్‌కు చేరింది. మరోవైపు స్టెఫానీ ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ టాప్కు చేరుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా స్టెఫానీ మూడు స్థానాలు దిగజారింది. మొత్తంగా స్టెఫానీ గతవారం జరిగిన పాక్ సిరీస్‌లో దారుణంగా విఫలం కావడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన పట్టును కోల్పోయింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంధాన కెరీర్ అత్యుత్తమ మూడో ర్యాంక్‌కు చేరుకుంది. -
'చాలా కాలం ఎదురు చూశాం'
కోల్ కతా: తమ చిరకాల స్వప్నం నెరవేరిందని వెస్టిండీస్ మహిళా క్రికెట్ కెప్టెన్ స్టాఫానీ టేలర్ పేర్కొంది. వరల్డ్ కప్ అందుకునేందుకు చాలా కాలంగా వేచిచూస్తున్నామని చెప్పింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి విండీస్ మహిళల జట్టు తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. 'వరల్డ్ కప్ అందుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. సరైన సమయంలో కప్ అందుకున్నాం. ఈ రోజు మేము అద్భుతంగా ఆడాం. ముందుగా బౌలింగ్ చేయాలనుకోలేదు. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పటికీ విజయం సాధించాం' అని మ్యాచ్ ముగిసిన తర్వాత టేలర్ పేర్కొంది. పురుషుల జట్టు తమకు అండగా నిలిచిందని తెలిపింది. తాము గెలవాలని కెప్టెన్ సామీ తనకు మెసేజ్ పంపించాడని వెల్లడించింది. అంచనాలకు మించి ఆడి టైటిల్ దక్కించుకున్నామని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన టేలర్ చెప్పింది.