'చాలా కాలం ఎదురు చూశాం' | Long wait over, says Windies women's skipper after WT20 triumph | Sakshi
Sakshi News home page

'చాలా కాలం ఎదురు చూశాం'

Published Sun, Apr 3 2016 6:58 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

'చాలా కాలం ఎదురు చూశాం'

'చాలా కాలం ఎదురు చూశాం'

కోల్ కతా: తమ చిరకాల స్వప్నం నెరవేరిందని వెస్టిండీస్ మహిళా క్రికెట్ కెప్టెన్ స్టాఫానీ టేలర్ పేర్కొంది. వరల్డ్ కప్ అందుకునేందుకు చాలా కాలంగా వేచిచూస్తున్నామని చెప్పింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి విండీస్ మహిళల జట్టు తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది.

'వరల్డ్ కప్ అందుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. సరైన సమయంలో కప్ అందుకున్నాం. ఈ రోజు మేము అద్భుతంగా ఆడాం. ముందుగా బౌలింగ్ చేయాలనుకోలేదు. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పటికీ విజయం సాధించాం' అని మ్యాచ్ ముగిసిన తర్వాత టేలర్ పేర్కొంది. పురుషుల జట్టు తమకు అండగా నిలిచిందని తెలిపింది. తాము గెలవాలని కెప్టెన్ సామీ తనకు మెసేజ్ పంపించాడని వెల్లడించింది. అంచనాలకు మించి ఆడి టైటిల్ దక్కించుకున్నామని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన టేలర్ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement