ICC Women T20 World Cup 2016
-
'చాలా కాలం ఎదురు చూశాం'
కోల్ కతా: తమ చిరకాల స్వప్నం నెరవేరిందని వెస్టిండీస్ మహిళా క్రికెట్ కెప్టెన్ స్టాఫానీ టేలర్ పేర్కొంది. వరల్డ్ కప్ అందుకునేందుకు చాలా కాలంగా వేచిచూస్తున్నామని చెప్పింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి విండీస్ మహిళల జట్టు తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది. 'వరల్డ్ కప్ అందుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. సరైన సమయంలో కప్ అందుకున్నాం. ఈ రోజు మేము అద్భుతంగా ఆడాం. ముందుగా బౌలింగ్ చేయాలనుకోలేదు. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పటికీ విజయం సాధించాం' అని మ్యాచ్ ముగిసిన తర్వాత టేలర్ పేర్కొంది. పురుషుల జట్టు తమకు అండగా నిలిచిందని తెలిపింది. తాము గెలవాలని కెప్టెన్ సామీ తనకు మెసేజ్ పంపించాడని వెల్లడించింది. అంచనాలకు మించి ఆడి టైటిల్ దక్కించుకున్నామని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన టేలర్ చెప్పింది. -
వెస్టిండీస్ టార్గెట్ 149
కోల్ కతా: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు ఆస్ట్రేలియా 149 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విలానీ, లానింగ్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. విలానీ 37 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేసింది. కెప్టెన్ లానింగ్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు సాధించింది. హీలీ 4, పెరీ 28, బ్లాక్ వెల్ 3 పరుగులు చేశారు. చివరి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. విండీస్ బౌలర్లలో డొతిన్ 2 వికెట్లు పడగొట్టింది. మాథ్యూస్, మొహమ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.