వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్‌గా స్థాఫనీ టేలర్ శకం ముగిసింది. ఆమె స్థానంలో సారథిగా ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్‌ను క్రికెట్ వెస్టిండీస్ నిమించింది. 2012లో వెస్టిండీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన టేలర్ దాదాపు 10 ఏళ్ల పాటు సారథిగా సేవలు అందించింది. టేలర్ సారథ్యంలో 55 టీ20లు, 62 వన్డేల్లో తలపడిన విండీస్.. వరుసగా 29, 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆమె కెప్టెన్సీలో 2016 టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకుంది.
ఇక మాథ్యూస్ గత కొన్నేళ్లుగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంది. మాథ్యూస్ ఇప్పటివరకు వెస్టిండీస్‌కు 69 వన్డేలు,61 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. "వెస్టిండీస్ మహిళల జట్టుకు కెప్టెన్‌గా అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జట్టును విజయ పథంలో నడిపించడానికి నా వంతు కృషిచేస్తాను. అదే విధంగా గత ఎనిమిదేళ్లగా టేలర్ సారథ్యంలో ఆడినందుకు గర్వపడుతున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో టేలర్ కీలక పాత్ర పోషించందని" మాథ్యూస్ పేర్కొంది.
చదవండి: India Tour Of West Indies 2022: సర్కారు వారి ఛానల్‌లో టీమిండియా మ్యాచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment