West Indies captain
-
నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం.. విండీస్ కెప్టెన్సీకి గుడ్‌బై
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్ కెప్టెన్సీ పూరన్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెళ్లడించాడు. కాగా ఈ ఏడాది కిరాన్ పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ సారధిగా ఎంపికయ్యాడు. కెప్టెన్‌గా ఎంపికైన పూరన్ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి విండీస్ నిష్క్రమించింది. " టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. ఆఖరికి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కాగా విండీస్ కెప్టెన్సీ బాధ్యతలను అంకితభావంతో స్వీకరించాను. నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటినుంచి జట్టుకు నా వంతు కృషిచేశాను. కానీ ప్రపంచకప్‌లో మాత్రం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. మాకు మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడేందుకు చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు మేము పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతాము" అని పూరన్ పేర్కొన్నాడు. అతడు 15 వన్డేలు, 15 టీ20ల్లో విండీస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20ల్లోనే కెప్టెన్‌గా పూరన్ విజయవంతమయ్యాడు. కాగా విండీస్ వైస్ కెప్టెన్‌గా ఉన్న పావెల్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. "I remain fully committed to West Indies cricket." - @nicholas_47 pic.twitter.com/n0OvM1v7yw — Windies Cricket (@windiescricket) November 21, 2022 చదవండి: IND vs NZ: గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్‌కు అవకాశం? -
వెస్టిండీస్ జట్టుకు కొత్త సారధి.. పాత కెప్టెన్‌పై వేటు..?
టీ20 వరల్డ్‌కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్ టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. వరల్డ్‌కప్‌లోనే కాక కెప్టెన్‌గా ఎంపికైన నాటి నుంచి వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమైన నికోలస్ పూరన్‌పై వేటుకు సర్వం సిద్ధమైంది. పరిమిత ఓవర్లలో విండీస్ కొత్త కెప్టెన్‌పై అధికారిక ప్రకటనే తరువాయి అని ఆ దేశ క్రికెట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూరన్ తదుపరి కెప్టెన్‌గా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఖరారైందని విండీస్ క్రికెట్ బోర్డులోని కీలక వ్యక్తి వెల్లడించారు. తాజాగా రోవ్‌మన్ పావెల్ సారధ్యంలోని జమైకా స్కార్పియన్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్-50 కప్ కైవసం చేసుకోవడంతో జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. శనివారం (నవంబర్ 19)జరిగిన సూపర్-50 కప్ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్ టైటిల్ సాధించడంలో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, వరల్డ్‌కప్-2022లో విండస్ ఘోర వైఫల్యం తర్వాత.. జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
వెస్టిండీస్ కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్..
వెస్టిండీస్ మహిళల జట్టు కెప్టెన్‌గా స్థాఫనీ టేలర్ శకం ముగిసింది. ఆమె స్థానంలో సారథిగా ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్‌ను క్రికెట్ వెస్టిండీస్ నిమించింది. 2012లో వెస్టిండీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన టేలర్ దాదాపు 10 ఏళ్ల పాటు సారథిగా సేవలు అందించింది. టేలర్ సారథ్యంలో 55 టీ20లు, 62 వన్డేల్లో తలపడిన విండీస్.. వరుసగా 29, 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆమె కెప్టెన్సీలో 2016 టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకుంది. ఇక మాథ్యూస్ గత కొన్నేళ్లుగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంది. మాథ్యూస్ ఇప్పటివరకు వెస్టిండీస్‌కు 69 వన్డేలు,61 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించింది. "వెస్టిండీస్ మహిళల జట్టుకు కెప్టెన్‌గా అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జట్టును విజయ పథంలో నడిపించడానికి నా వంతు కృషిచేస్తాను. అదే విధంగా గత ఎనిమిదేళ్లగా టేలర్ సారథ్యంలో ఆడినందుకు గర్వపడుతున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో టేలర్ కీలక పాత్ర పోషించందని" మాథ్యూస్ పేర్కొంది. చదవండి: India Tour Of West Indies 2022: సర్కారు వారి ఛానల్లో టీమిండియా మ్యాచ్‌లు -
పాక్ పై ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది: పూరన్
ఆదివారం ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన అఖరి వన్డేలో 53 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి చెందింది. తద్వారా పాక్ చేతిలో 0-3 తేడాతో విండీస్ వైట్‌వాష్‌కు గురైంది. కాగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ఈ సిరీస్‌లో ఓటమి తమను తీవ్రంగా నిరాశ పరిచింది చెప్పాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్ కోసం తాను ఎదురు చూస్తున్నానని పూరన్ తెలిపాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేల్లో వెస్టిండీస్ తలపడనుంది. జూన్ 16 (గురువారం) నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. “అఖరి రెండు మ్యాచ్‌లు మాకు నిరాశ కలిగించాయి. తొలి వన్డేలో మేం బాగా రాణించాం. తర్వాతి మ్యాచ్‌ల్లో మేము పూర్తిగా విఫలమయ్యాం. దీని ఫలితంగా సిరీస్‌కు కోల్పోయాము. ఈ పరాజయం నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. త్వరలో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ఈ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము" అని పూరన్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే: టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్ పాక్ స్కోరు: 269/9 (48) వెస్టిండీస్ స్కోరు: 216 (37.2) విజేత: డీఎల్ఎస్ మెథడ్‌లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాదాబ్ ఖాన్(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) చదవండి: IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, జియో! ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే! -
వెస్టిండీస్ కెప్టెన్‌కు అరుదైన గౌరవం
టి-20 ప్రపంచ కప్ సాధించిన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీకి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కింది. సెయింట్ లూసియాలోని ది బ్యూసెజోర్ క్రికెట్ స్టేడియానికి స్యామీ పేరు పెట్టారు. ఈ స్టేడియం పేరును డారెన్ స్యామీ నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు. సెయింట్ లూసియా క్రికెటర్లు స్యామీ, జాన్సన్ చార్లెస్లకు ప్రధాని కెన్నీ డీ ఆంథోనీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేడియం పేరు మార్పు విషయాన్ని ప్రకటించారు. స్టేడియంలోని ఓ స్టాండ్‌కు చార్లెస్ పేరు పెట్టనున్నారు. స్వదేశంలో తనకు లభించిన స్వాగతసత్కారాల పట్ల స్యామీ ఉప్పొంగిపోయాడు. 'నాకు అరుదైన గౌరవం దక్కింది. అందరికీ ధన్యవాదాలు. సెయింట్ లూసియన్స్ ఎంతో ప్రేమిస్తారు. ఎయిర్‌పోర్టులో ప్రేమాభిమానాలు, గౌరవం దక్కాయి. ఓ మై గాడ్.. థ్యాంక్యూ వెరీ మచ్' అని స్యామీ ఉద్వేగంతో అన్నాడు. కరీబియన్ దీవులు వెస్టిండీస్ జట్టు పేరుతో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్ విజేత జట్టులో కెప్టెన్ స్యామీ, జాన్సన్ చార్లెస్ సెయింట్ లూసియాకు చెందినవారు. స్యామీ సారథ్యంలో విండీస్ రెండుసార్లు టి-20 ప్రపంచ కప్ సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ స్యామీ కావడం విశేషం. -
టెస్టుల్లో పునరాగమనంపై గేల్ ఆశలు..
మెల్ బోర్న్: ఏడాదికిపైగా టెస్టు జట్టుకు దూరంగా ఉంటున్నవెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ వచ్చే ఏడాది టెస్టుల్లో తిరిగి ఆడాలనుకుంటున్నట్లు తాజాగా స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన గేల్ విలేకర్లతో మాట్లాడాడు. రాబోయే సంవత్సరానికల్లా తన గాయం పూర్తిగా నయమైతే టెస్టుల్లో ఆడతానని తెలిపాడు. 'ఇప్పటికే జట్టుతో ఉండాలి. కానీ వెన్నునొప్పి కారణంగా టెస్టుల నుంచి సుదీర్ఘ విరామం తీసుకోవాల్సి వచ్చింది. 2016లో టెస్టు క్రికెట్ ఆడటమే నా తదుపరి ఎజెండా' అని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014, సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో కింగ్ స్టన్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో గేల్ చివరిసారి కనిపించాడు.