వెస్టిండీస్ కెప్టెన్కు అరుదైన గౌరవం | St Lucia renames stadium in honour of Darren Sammy | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ కెప్టెన్కు అరుదైన గౌరవం

Published Wed, Apr 6 2016 1:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

వెస్టిండీస్ కెప్టెన్కు అరుదైన గౌరవం

వెస్టిండీస్ కెప్టెన్కు అరుదైన గౌరవం

టి-20 ప్రపంచ కప్ సాధించిన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీకి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కింది. సెయింట్ లూసియాలోని ది బ్యూసెజోర్ క్రికెట్ స్టేడియానికి స్యామీ పేరు పెట్టారు. ఈ స్టేడియం పేరును డారెన్ స్యామీ నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు. సెయింట్ లూసియా క్రికెటర్లు స్యామీ, జాన్సన్ చార్లెస్లకు ప్రధాని కెన్నీ డీ ఆంథోనీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేడియం పేరు మార్పు విషయాన్ని ప్రకటించారు. స్టేడియంలోని ఓ స్టాండ్కు చార్లెస్ పేరు పెట్టనున్నారు.

స్వదేశంలో తనకు లభించిన స్వాగతసత్కారాల పట్ల స్యామీ ఉప్పొంగిపోయాడు. 'నాకు అరుదైన గౌరవం దక్కింది. అందరికీ ధన్యవాదాలు. సెయింట్ లూసియన్స్ ఎంతో ప్రేమిస్తారు. ఎయిర్పోర్టులో ప్రేమాభిమానాలు, గౌరవం దక్కాయి. ఓ మై గాడ్.. థ్యాంక్యూ వెరీ మచ్' అని స్యామీ ఉద్వేగంతో అన్నాడు. కరీబియన్ దీవులు వెస్టిండీస్ జట్టు పేరుతో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్ విజేత జట్టులో కెప్టెన్ స్యామీ, జాన్సన్ చార్లెస్ సెయింట్ లూసియాకు చెందినవారు. స్యామీ సారథ్యంలో విండీస్ రెండుసార్లు టి-20 ప్రపంచ కప్ సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌ స్యామీ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement