St Lucia
-
202 పరుగుల టార్గెట్... 24 రన్స్‌కే 4 వికెట్లు! కట్ చేస్తే సంచలన విజయం
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ శుభారంభం చేసింది. ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా ఘన విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో లూసియా కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది.అయితే లక్ష్య చేధనలో సెయింట్ లూసియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో లూసియా బ్యాటర్లు టిమ్ సీఫెర్ట్ , భానుక రాజపక్స అద్భుతం చేశారు. వీరిద్దరూ సెయింట్ కిట్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.సిక్సర్ల వర్షం కురిపిస్తూ తమ జట్టును లక్ష్యం వైపు తీసుకువెళ్లారు. సీఫెర్ట్(27 బంతుల్లో 64, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటైనప్పటకి రాజపక్స(67 నాటౌట్) మాత్రం తన దూకుడును కొనసాగించాడు. వీరిద్దరితో పాటు డేవిడ్ వీస్(20 బంతుల్లో 34) తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫలితంగా భారీ లక్ష్యాన్ని సెయింట్ లూసియా సునాయసంగా ఛేదించింది.లూయిస్ సెంచరీ వృధా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెయింట్ కిట్స్ ఓపెనర్ ఎవెన్ లూయిస్ సెంచరీతో మెరిశాడు. 54 బంతులు ఎదుర్కొన్న 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. అతడితో పాటు కైల్ మైర్స్(92) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సెయింట్ కిట్స్ ఓటమి పాలవ్వడంతో వీరి ఇన్నింగ్స్ వృధా అయిపోయింది. -
డుప్లెసిస్ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు..
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్ 2021లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఉగ్రరూపం దాల్చాచాడు. 51 బంతుల్లోనే శతక్కొట్టి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్.. 60 బంతుల్లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో రోస్టన్ ఛేజ్(31 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సెయింట్ లూసియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. 100 for @faf1307 but the skippa still thinks there is work to be done‼️ #SLKvSKNP #CPL21 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/cqPzGFnTAg — CPL T20 (@CPL) September 4, 2021 అనంతరం ఛేదనలో సెయింట్ కిట్స్ 16.5 ఓవర్లలో కేవలం 124 పరుగులు మాత్రమే చేసి చాప చాట్టేయడంతో ప్రత్యర్ధి 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ఎంచుకున్న విధ్వంసకర వీరుడు ఎవిన్ లూయిస్(42 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు.సెయింట్ లూసియా బౌలర్లు అల్జరీ జోసఫ్(3/27), కీమో పాల్(3/23) ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా, వాహబ్ రియాజ్, రోస్టన్ ఛేజ్, కెస్రిక్ విలియమ్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే డుప్లెసిస్.. శతక్కొట్టడంతో సీఎస్కే ఆభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యే ఐపీఎల్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌ల్లో కూడా డుప్లెసిస్ ఇదే తరహాలో రాణించాలని ఆశిస్తున్నారు. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న జరిగే మ్యాచ్‌లో సీఎస్కే.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. చదవండి: గాయం వేధిస్తున్నా పెయిన్ కిల్లర్ తీసుకుని మరీ ఆడాడు.. -
శివాలెత్తిన రసెల్.. అతి భారీ స్కోర్ నమోదు చేసిన జమైకా తలైవాస్
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్(సీపీఎల్) 2021 సీజన్లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్(14 బంతులో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను చితక్కొటి సీపీఎల్ చరిత్రలో తన జట్టు రెండో అతి భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రసెల్ విధ్వంసానికి తోడు చాడ్విక్ వాల్టన్(29 బంతులో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెన్నార్ లూయిస్(21 బంతులో 48; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), హైదర్ అలీ(32 బంతులో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోమన్ పావెల్(26 బంతులో 38; 3 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగి ఆడటంతో జమైకా తైలవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జమైకా తైలవాస్ టాపార్డర్ ధాటికి ప్రత్యర్ధి బౌలర్లు వణిపోయారు. సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో ఓబెద్ మెక్ కాయ్ 3 వికెట్లు పడగొట్టగా, రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్ లూసియా జట్టు ఆరంభంలోనే తడబడింది. జమైకా బౌలర్ ప్రిటోరియస్(3/25) సెయింట్ లూసియా జట్టును దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి క్రిస్ గ్రీన్(1/22), ఆండ్రీ రసెల్(1/9) తోడవ్వడంతో 5 ఓవర్ల తర్వాత సెయింట్ లూసియా స్కోర్ 56/5. ఆ జట్టు గెలవాలంటే 90 బంతుల్లో 200 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: నీకంత సీన్ లేదంటూ ఆ ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు.. -
ప్రియుడి కోసం అనుష్క ఫారిన్ టూర్
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమతమ కెరీర్లో సక్సెస్‌తో పాటు ప్రేమపక్షులుగా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. చాలాకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కోహ్లీ, అనుష్క మధ్యలో విడిపోయినట్టు వార్తలు వచ్చినా మళ్లీ కలసిపోయారు. ఇటీవల ఈ జంట లండన్ లో కనిపించింది. తాజాగా అనుష్క తన ప్రియుడు కోహ్లీని కలిసేందుకు వెస్టిండీస్‌కు వెళ్లినట్టు సమాచారం. వెస్టిండీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టుతో కలసి విరాట్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెయింట్ లూసియాలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతోంది. అనుష్క కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. కరణ్ జోహార్ సినిమాలో నటిస్తున్న అనుష్కకు విరామం లభించడంతో గతవారం కరీబియన్ దీవులకు పయనమైందట. మూడో టెస్టు సందర్భంగా సెయింట్ లూసియా స్టేడియం స్టాండ్స్ నుంచి అనుష్క విరాట్‌కు విష్ చేసినట్టు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చాలాసార్లు క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు అనుష్క స్టేడియాలను వచ్చిన సంగతి తెలిసిందే. స్టాండ్స్ నుంచి అనుష్క విషెస్ చెప్పడం, కోహ్లీ ఫ్లయింగ్ కిస్‌లు విసరడం ప్రేక్షకులు, టీవీ చానెళ్ల కంట పడ్డాయి. -
వెస్టిండీస్ కెప్టెన్‌కు అరుదైన గౌరవం
టి-20 ప్రపంచ కప్ సాధించిన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీకి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కింది. సెయింట్ లూసియాలోని ది బ్యూసెజోర్ క్రికెట్ స్టేడియానికి స్యామీ పేరు పెట్టారు. ఈ స్టేడియం పేరును డారెన్ స్యామీ నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు. సెయింట్ లూసియా క్రికెటర్లు స్యామీ, జాన్సన్ చార్లెస్లకు ప్రధాని కెన్నీ డీ ఆంథోనీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేడియం పేరు మార్పు విషయాన్ని ప్రకటించారు. స్టేడియంలోని ఓ స్టాండ్‌కు చార్లెస్ పేరు పెట్టనున్నారు. స్వదేశంలో తనకు లభించిన స్వాగతసత్కారాల పట్ల స్యామీ ఉప్పొంగిపోయాడు. 'నాకు అరుదైన గౌరవం దక్కింది. అందరికీ ధన్యవాదాలు. సెయింట్ లూసియన్స్ ఎంతో ప్రేమిస్తారు. ఎయిర్‌పోర్టులో ప్రేమాభిమానాలు, గౌరవం దక్కాయి. ఓ మై గాడ్.. థ్యాంక్యూ వెరీ మచ్' అని స్యామీ ఉద్వేగంతో అన్నాడు. కరీబియన్ దీవులు వెస్టిండీస్ జట్టు పేరుతో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్ విజేత జట్టులో కెప్టెన్ స్యామీ, జాన్సన్ చార్లెస్ సెయింట్ లూసియాకు చెందినవారు. స్యామీ సారథ్యంలో విండీస్ రెండుసార్లు టి-20 ప్రపంచ కప్ సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ స్యామీ కావడం విశేషం.