ప్రియుడి కోసం అనుష్క ఫారిన్ టూర్ | Lovers Virat and Anushka's secret date in St Lucia | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం అనుష్క ఫారిన్ టూర్

Published Wed, Aug 10 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

ప్రియుడి కోసం అనుష్క ఫారిన్ టూర్

ప్రియుడి కోసం అనుష్క ఫారిన్ టూర్

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమతమ కెరీర్లో సక్సెస్తో పాటు ప్రేమపక్షులుగా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. చాలాకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కోహ్లీ, అనుష్క మధ్యలో విడిపోయినట్టు వార్తలు వచ్చినా మళ్లీ కలసిపోయారు. ఇటీవల ఈ జంట లండన్ లో కనిపించింది. తాజాగా అనుష్క తన ప్రియుడు కోహ్లీని కలిసేందుకు వెస్టిండీస్కు వెళ్లినట్టు సమాచారం.

వెస్టిండీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టుతో కలసి విరాట్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెయింట్ లూసియాలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతోంది. అనుష్క కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. కరణ్ జోహార్ సినిమాలో నటిస్తున్న అనుష్కకు విరామం లభించడంతో గతవారం కరీబియన్ దీవులకు పయనమైందట. మూడో టెస్టు సందర్భంగా సెయింట్ లూసియా స్టేడియం స్టాండ్స్ నుంచి అనుష్క విరాట్కు విష్ చేసినట్టు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చాలాసార్లు క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు అనుష్క స్టేడియాలను వచ్చిన సంగతి తెలిసిందే. స్టాండ్స్ నుంచి అనుష్క విషెస్ చెప్పడం, కోహ్లీ ఫ్లయింగ్ కిస్లు విసరడం ప్రేక్షకులు, టీవీ చానెళ్ల కంట పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement