ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ వరుస విజయలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో కరీబియన్ టీమ్ పపువా న్యూ గినియా, ఉగాండ, తాజాగా న్యూజిలాండ్‌పై ఘన విజయాలు సాధించి గ్రూప్-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విండీస్.. హ్యాట్రిక్ విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో నిలిచింది. ఈ టోర్నీకి ముందు విండీస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. జట్టులో అందరూ విధ్వంసకర వీరులే అయినప్పటికీ, ఆ జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు, 2022 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో విండీస్ మెరుపు ప్రదర్శనల వెనక ఆ జట్టు కోచ్ డారెన్ సామీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండు సార్లు (2012, 2016) విండీస్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన సామీ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోచ్‌గా తన మార్కును చూపిస్తున్నాడు. సామీ ఆధ్వర్యంలో విండీస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. స్వదేశంలో ఆడుతుండటం విండీస్‌కు అదనంగా కలిసొస్తుంది.
ఇదిలా ఉంటే, సూపర్-8కు ఇదివరకే అర్హత సాధించిన వెస్టిండీస్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్‌ను జూన్ 19న ఆడనుంది. సెయింట్ లూసియా వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో కరీబియన్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. సూపర్-8 రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్.. సౌతాఫ్రికాను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment