మెల్ బోర్న్: ఏడాదికిపైగా టెస్టు జట్టుకు దూరంగా ఉంటున్నవెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ వచ్చే ఏడాది టెస్టుల్లో తిరిగి ఆడాలనుకుంటున్నట్లు తాజాగా స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన గేల్ విలేకర్లతో మాట్లాడాడు. రాబోయే సంవత్సరానికల్లా తన గాయం పూర్తిగా నయమైతే టెస్టుల్లో ఆడతానని తెలిపాడు. 'ఇప్పటికే జట్టుతో ఉండాలి. కానీ వెన్నునొప్పి కారణంగా టెస్టుల నుంచి సుదీర్ఘ విరామం తీసుకోవాల్సి వచ్చింది. 2016లో టెస్టు క్రికెట్ ఆడటమే నా తదుపరి ఎజెండా' అని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014, సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో కింగ్ స్టన్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో గేల్ చివరిసారి కనిపించాడు.
టెస్టుల్లో పునరాగమనంపై గేల్ ఆశలు..
Published Tue, Dec 15 2015 3:00 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM
Advertisement
Advertisement