PC: IPL.com
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం తలపడనుంది. ఈ క్రమంలో ఆ జట్టు పవర్ హిట్టర్ రోవ్‌మాన్ పావెల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గత ఓటముల గురించి ఆలోచించే సమయం లేదని.. కచ్చితంగా కేకేఆర్‌పై విజయం సాధిస్తామని అతడు థీమా వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ ఉండాలంటే.. రాబోయే మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలని పావెల్ తెలిపాడు. కాగా గత శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఖరి ఓవర్‌లో ఆరు బంతుల్లో 36 పరుగులు అవసరమవ్వగా.. పావెల్ వరుస మూడు బంతుల్లో మూడు సిక్స్‌లు బాది మ్యాచ్‌పై ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే.
"గత మ్యాచ్‌లు గురించి ఆలోచించే సమయం ఇప్పుడు మాకు లేదు. మాకు ముందు ముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించాలి అనుకుంటున్నాం. ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించమంటే.. కచ్చితంగా టైటిల్ నెగ్గుతాం. కాగా మునపటి మ్యాచ్‌లో అఖరి ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టగలని నమ్మకంగా ఉన్నాను. తొలి రెండు బంతులకు సిక్స్‌లు కొట్టాక.. మూడో బంతిని కూడా స్టాండ్స్‌కు తరలించాను. అయితే అది నో బాల్ అని నేను ఆశించాను. కానీ అంపైర్ నిర్ణయమే అంతిమమైనది కాబట్టి. క్రికెటర్‌గా అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి" అని రోవ్‌మాన్ పావెల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment