West Indies vs England 3rd T20I: Rovman Powell 51-Ball Century - Sakshi
Sakshi News home page

Rovman Powell: 10 సిక్సర్లతో విండీస్‌ బ్యాటర్‌ విధ్వంసం

Published Thu, Jan 27 2022 8:36 AM | Last Updated on Fri, Jan 28 2022 11:03 AM

Rovman Powell 51-Ball Century 3rd T20 West Indies Series Victory Vs ENG - Sakshi

Rovman Powell Hits Century In 51 Balls.. వెస్టిండీస్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టి20లో మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించాడు మెరిశాడు. సిక్సర్ల వర్షం కురిపించిన పావెల్‌.. 53 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అతని ధాటికి వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. నికోలస్‌ పూరన్‌ 43 బంతుల్లో 70 పరుగులతో రాణించాడు.

చదవండి: అయ్యర్‌పై వేటు.. రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్‌; తొలి వన్డేకు రాహుల్‌ దూరం

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో ఓపెనర్‌ టామ్‌ బాంటన్‌ (39 బంతుల్లో 73 పరుగులు, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), పిలిఫ్‌ సాల్ట్‌(24 బంతుల్లో 57, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినప్పటికి మిగతావారు విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో షెఫర్డ్‌ మూడు, పొలార్డ్‌ 2, మిగతా బౌలర్లలో హొస్సేన్‌, హోల్డర్‌, కాట్రెల్‌ తలా ఒక వికెట్‌ తీశారు. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో విండీస్‌ 2-1తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. కెన్నింగ్సటన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 40 ఓవర్లలో 428 పరుగులు చేయడం వెస్టిండీస్‌ గడ్డపై అత్యధిక స్కోరుగా రికార్డు నమోదైంది. మ్యాచ్‌ మొత్తంలో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 31 సిక్సర్లు.. 19 ఫోర్లు కొట్డడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement