![Powells humongous six lands outside the ground - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/9/Bowling.jpg.webp?itok=v0jjI2h9)
వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పావెల్.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
భారీ సిక్సర్ బాదిన పావెల్..
ఈ మ్యాచ్‌లో పావెల్ 116 మీటర్ల ఓ భారీ సిక్సర్ బాదాడు. 15 ఓవర్ వేసిన మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో తొలి బంతిని పావెల్ సిక్స్‌గా మలిచాడు. పావెల్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. దెబ్బకు నవాజ్‌కు ప్యూజ్‌లు ఎగిరిపోయాయి. పావెల్ కొట్టిన సిక్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే బిగెస్ట్ సిక్స్‌ల్లో ఒకటిగా నిలిచింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 8 వికెట్ల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
క్వెట్టా ఓపెనర్ ఓపెనర్ జాసన్ రాయ్(63 బంతుల్లో 145పరుగులు నాటౌట్) విధ్వంసకర శతకంతో తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 65 బంతులు ఎదుర్కొన్న బాబర్ 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు సాధించాడు.
చదవండి: BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు..
Rovman Powell, what a shot 👏 #HBLPSL8 pic.twitter.com/hrJaON9hLL
— Farid Khan (@_FaridKhan) March 8, 2023
Comments
Please login to add a commentAdd a comment