T20 World Cup 2022: West Indies Announced T20 Squad, Evin Lewis Returns To Team - Sakshi
Sakshi News home page

T20 WC 2022: పవర్‌ హిట్టర్‌ రీ ఎంట్రీ.. టి20 ప్రపంచకప్‌కు విండీస్‌ జట్టు

Published Thu, Sep 15 2022 8:00 AM | Last Updated on Thu, Sep 15 2022 9:05 AM

Evin Lewis Returns West Indies Squad For T20 World Cup 2022 - Sakshi

అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022కు విండీస్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన విండీస్‌ జట్టులోకి పవర్‌ హిట్టర్‌ ఎవిన్‌ లూయిస్‌ రీ ఎంట్రీ ఇవ్వగా.. నికోలస్‌ పూరన్‌ కెప్టెన్‌ కాగా.. రోవ్‌మెన్‌ పావెల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

కాగా హిట్టర్‌గా పేరు పొందిన ఎవిన్‌ లూయిస్‌ విండీస్‌ తరపున మ్యాచ్‌ ఆడి ఏడాది దాటిపోయింది. చివరగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లోనే విండీస్‌ తరపున ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో రెండుసార్లు చాంపియన్‌ అయిన వెస్టిండీస్‌ జట్టు ఈసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12కు క్వాలిఫై కాలేదు. దీంతో క్వాలిఫయింగ్‌ దశలో వెస్టిండీస్‌.. స్కాట్లాండ్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌లతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లు గెలిచి సూపర్‌-12లో చోటు దక్కించుకోవాలని విండీస్‌ ఆశిస్తోంది. ఇక విండీస్‌ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఎదుర్కోనుంది.

టి20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్ (వైస్‌ కెప్టెన్‌), ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, ఓడియన్ స్మిత్, జాన్సన్ చార్లెస్, షిమ్రాన్ హెట్‌మైర్‌, జాసన్ హోల్డర్, రేమాన్ రీఫర్, ఒబెద్‌ మెక్‌కాయ్, అల్జారీ జోసెఫ్, అకేల్ హొసేన్‌, షెల్డన్ కాట్రెల్‌, యానిక్ కరియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement