టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన క్వాలిఫయర్ పోరులో విండీస్ బ్యాటర్ రోవ్‌మెన్ పావెల్ భారీ సిక్సర్ బాదాడు. ఇప్పుడు ఈ సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అయింది పావెల్ కొట్టిన సిక్సర్ కాదు.. అకిల్ హొసేన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ బ్లెస్సింగ్ ముజరబానీ వేశాడు.
ఆ ఓవర్‌లో మూడో బంతిని రోవ్‌మెన్ పావెల్ లాంగాఫ్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. దాదాపు 104 మీటర్ల దూరం వెళ్లిన బంతి చాలా ఎత్తులో ఉంది. అందుకే అకిల్ హొసెన్ పావెల్ కొట్టిన సిక్స్‌ను కన్నార్పకుండా చూసి ''వామ్మో ఎంత పెద్ద సిక్స్'' అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అందుకే హొసెన్ ఎక్స్‌ప్రెషన్ ట్రెండింగ్‌లో నిలిచింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్‌లో ఓపెనర్ చార్లెస్ (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆపై బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్ (4/16), జేసన్ హోల్డర్ (3/12) నిప్పులు చెరిగారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ వెస్లీ మదెవెర్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), చివర్లో లూక్ జాంగ్వే (22 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. మిగతా వారిలో ఆరుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రెండు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన విండీస్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి ‘సూపర్ 12’ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment