IPL 2022: Rovman Powell Reveals What He Would Have Become if Not a Cricketer - Sakshi
Sakshi News home page

IPL 2022: 'నేను క్రికెటర్‌ కాకపోయింటే సైనికుడిని అయ్యేవాడిని'

Published Tue, May 10 2022 5:46 PM | Last Updated on Tue, May 10 2022 8:44 PM

Rovman Powell reveals what he wouldve become if not a cricketer - Sakshi

రోవ్‌మెన్‌ పావెల్‌ (PC: BCCI)

ఐపీఎల్‌-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో పావెల్‌ విఫలమైనా.. తర్వాత మ్యాచ్‌ల్లో తన హిట్టింగ్‌తో జట్టుకు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పావెల్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

"నేను జమైకాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా గ్రామంలో చాలా కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయం. నాకు చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే మక్కువ ఎ‍క్కువ.  క్రికెట్‌ బాగా ఆడి నా కటుంబాన్ని  పేదరికం నుంచి బయటపడేయాలని నేను కలలు కన్నాను. ఆ దేవుని దయ వల్ల క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాను. ఒక వేళ  నేను ప్రొఫెషనల్ క్రికెటర్ కాకపోయింటే సైనికుడిని అయ్యేవాడిని" అని పావెల్‌ పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన పావెల్‌ 205 పరుగులు సాధించాడు. పావెల్‌ ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది.

చదవండి: Rovman Powell: 'మూడురోజులు టవల్‌ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement